నోరు జారిన పూజా హెగ్డే.. విరుచుకుపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!
on Feb 5, 2025
కొందరు నటీనటులు పలు భాషల్లో సినిమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సినిమాల గురించి మాట్లాడేటప్పుడు తడబడటం సహజం. కానీ తమకు ఎంతో పేరు తీసుకొచ్చిన, తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా గురించి మాట్లాడేటప్పుడు తడబడతారా?. ఆ అవకాశమే లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే పూజా హెగ్డే తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ 'అల వైకుంఠపురములో' విషయంలో తడబడి అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. (Pooja Hegde)
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అల వైకుంఠపురములో'. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా, అప్పుడు టాలీవుడ్ లో రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే ఇప్పటికీ పూజ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ గా ఉంది. అంతేకాదు పూజా హెగ్డే ఈ సినిమాతోనే బుట్టబొమ్మగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అంతటి స్పెషల్ సినిమాని, తమిళ్ మూవీ అంటూ కామెంట్స్ చేసి బన్నీ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది పూజ.
రీసెంట్ గా షాహిద్ కపూర్ తో కలిసి దేవా అనే హిందీ సినిమాలో నటించింది పూజ. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. "నేను నటించిన తమిళ చిత్రం అల వైకుంఠపురములో పాన్ ఇండియా సినిమా కానప్పటికీ, హిందీ ప్రేక్షకులకు చేరువైంది. మన వర్క్ బాగుంటే, ఆడియన్స్ ఆదరిస్తారు." అని పూజ కామెంట్స్ చేసింది.
'అల వైకుంఠపురములో' లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ని తమిళ సినిమా అని పూజ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ ఏ భాషలో రూపొందిందో కూడా పూజకు గుర్తులేదా? అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పూజ తీరుపై విరుచుకుపడుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
