Home

»

Latest News

రచ్చ సెట్ లో రామ్ చరణ్ ని కలిసిన అల్లు అర్జున్

Jul 16, 2011

"రచ్చ" సెట్ లో రామ్ చరణ్ ని కలిసిన అల్లు అర్జున్ అని తెలిసింది. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". రామ్ చరణ్ "రచ్చ" చిత్రం షూటింగ్ ప్రస్తుతం శ్రీలంక దేశంలో జరుగుతూంది. అక్కడ హీరో రామ్ చరణ్, హీరోయిన్ తమన్నాలపై ఒక యుగళ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు.

అల్లు అర్జున్ తన విహార యాత్రలో భాగంగా శ్రీలంకకు కూడా వెళ్ళారు. అక్కడ అల్లు అర్జున్ తన బావ రామ్ చరణ్ సినిమా "రచ్చ" షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి,అతనితో కాసేపు ముచ్చటించారట. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమాలో హీరోగా నటించటానికి అంగీకరించారు. ఈ చిత్రంలో నలక నడుము గోవా భామ ఇలియానా హీరోగా నటించటానికి అంగీకరించింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com