Home

»

Latest News

నటుడిగా 25 యేళ్ళు పూర్తి చేసుకున్న నాగార్జున

May 22, 2011

నటుడిగా 25 యేళ్ళు పూర్తి చేసుకున్న నాగార్జున. వివరాల్లోకి వెళితే సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఇదే రోజున అంటే "మే" 23 వ తేదీన, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున "విక్రమ్" సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ అనేక ఎత్తుపల్లాలను, జయాపజయాలనూ ఆయన తన సినీ కెరీర్ లో చవిచూసి, ఈరోజున ఆయనీ స్థితిలో అంటే తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అక్కినేని నాగార్జున. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్ లో "అరణ్యకాండ" వంటి సూపర్ ఫ్లాప్ లనూ చుశారు.

"అన్నమయ్య" వంటి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన చిత్రాలనూ చూశారు. ఎవరూ నటించటానికి, నిర్మించటానికీ కూడా సాహసించని "శివ" వంటి విభిన్నమైన ట్రెండ్ సెట్టర్ సినిమాల్లోనూ నటించారు. "గీతాంజలి" వంటి క్లాసిక్ సినిమాలోనూ నటించారు. అలాంటి యువసామ్రాట్ నాగార్జున నటుడిగా పుట్టిన ఈ రోజు ఆయనకీ, ఆయన అభిమానులకూ చాలా ముఖ్యమైన రోజు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగువన్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com