అఖండ 2 తర్వాత సరికొత్త బాలయ్య..అభిమానుల పిలుపు మారబోతుందా!
on Apr 15, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna)తన ప్రీవియస్ మూవీ 'డాకు మహారాజ్'(Daaku Maharaaj)హిట్ ఇచ్చిన జోష్ తో తన అప్ కమింగ్ మూవీగా 'అఖండ 2' (Akhanda 2)చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను(BOyapati Srinu)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2021 లో వచ్చిన 'అఖండ' కి సీక్వెల్ కావడంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బోయపాటి,బాలయ్య కాంబోలో ఇప్పటి దాకా వచ్చిన మూడు సినిమాలు, ఒక దాన్ని మించి ఒకటి విజయాన్ని సాధించాయి. దీంతో అఖండ 2 సాధించే రికార్డులపైనే అందరి కళ్ళు ఉన్నాయి. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichand Malineni)చెప్పిన స్టోరీ బాలకృష్ణకి నచ్చిందని, దీంతో అఖండ 2 తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ తో చేయబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే ఫ్యాక్షన్ నేపథ్యంలో వీరసింహారెడ్డి' వచ్చిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ యాక్షన్ అండ్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కగా, ఒక సరికొత్త బాలయ్యని అభిమానులకి పరిచయం చేసింది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లలో బాలయ్య ప్రదర్శించిన నటన నభూతో నభవిష్యత్తు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బాలయ్య, గోపీచంద్ కాంబోలో తెరకెక్కే మూవీ ఎలాంటి సబ్జెట్ తో తెరకెక్కుతుందనే ఆసక్తి అందరిలోను మొదలయ్యింది. అన్ని కుదిరితే జూన్ నుంచి షూట్ కి వెళ్లవచ్చని, 2026 సంక్రాంతికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశముందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఈ మూవీని వృద్ధి సినిమాస్ తో కలిసి మరో బడా బ్యానర్ నిర్మించనున్నట్టుగా తెలుస్తుంది. డెబ్యూ ప్రొడక్షన్ సంస్థ అయినటువంటి వృద్ధి సినిమాస్ తమ ఫస్ట్ మూవీగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో 'పెద్ది' నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో 'పెద్ది'(Peddi)ని తెరకెక్కిస్తున్నారు. దీంతో బాలయ్యతో తమ సెకండ్ ప్రాజెక్ట్ ని ఆ సంస్థ ఏ స్థాయిలో నిర్మిస్తుందో చెప్పక్కర్లేదు. గోపీచంద్ మలినేని రీసెంట్ గా హిందీలో సన్నీడియోల్ తో 'జాట్' తెరకెక్కించి భారీ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
