Home

»

Latest News

బిగ్ టికెట్ ఫిల్మ్స్ కి మ‌హేశ్ వాయిస్ ఓవ‌ర్.. ఇంట్రెస్టింగ్ క‌నెక్ష‌న్ అదే!

Apr 22, 2022 4:42PM

2008లో రిలీజైన `జ‌ల్సా` కోసం తొలిసారిగా వాయిస్ ఓవ‌ర్ అందించి.. ఆ చిత్రానికి ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. ఆపై `బాద్ షా` (2013), `శ్రీ శ్రీ‌` (2016), `మ‌న‌సుకు న‌చ్చింది`  (2018) సినిమాల‌కు కూడా వాయిస్ ఓవ‌ర్ ప‌రంప‌ర‌ని కొన‌సాగించాడీ ఘ‌ట్ట‌మ‌నేని వారి హ్యాండ్స‌మ్ హీరో. క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం ఇప్పుడు `ఆచార్య‌` కోసం మ‌రోసారి గ‌ళ‌మిచ్చాడు మ‌హేశ్.

ఇదిలా ఉంటే.. `జ‌ల్సా`, `బాద్ షా`, `ఆచార్య‌` ఇలా ఇప్ప‌టివ‌ర‌కు మ‌హేశ్ వాయిస్ ఓవ‌ర్ అందించిన భారీ బ‌డ్జెట్ మూవీస్ అన్నింటికీ ఓ ఇంట్రెస్టింగ్ క‌నెక్ష‌న్ ఉంది.  అదేమిటంటే.. ఇవ‌న్నీ కూడా ఏప్రిల్ రిలీజెస్ నే. 2008 ఏప్రిల్ 2న `జ‌ల్సా` రిలీజైతే.. 2013 ఏప్రిల్ 5న `బాద్ షా` విడుద‌లైంది. ఇక `ఆచార్య‌` కూడా ఈ ఏడాది ఏప్రిల్ 29న రాబోతోంది. మ‌రి..  `జ‌ల్సా`, `బాద్ షా` త‌ర‌హాలో `ఆచార్య‌` కూడా ఏప్రిల్ హిట్స్ లో చేరుతుందేమో చూడాలి.

అన్న‌ట్టు.. `జ‌ల్సా`కి ముందు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గ‌త చిత్రమైన‌ `అత‌డు`(2005)లోనూ, `బాద్ షా`కి ముందు కెప్టెన్ శ్రీ‌ను వైట్లకి ప్రీవియ‌స్ మూవీ అయిన `దూకుడు` (2011)లోనూ.. అలాగే `ఆచార్య‌`కి ముందు నిర్దేశ‌కుడు కొర‌టాల శివ గ‌త చిత్రం `భ‌ర‌త్ అనే నేను` (2018)లోనూ మ‌హేశ్ బాబునే కథానాయ‌కుడు కావ‌డం గ‌మ‌నార్హం.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com