విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, అక్టోబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
'ఆదర్శ కుటుంబం' సినిమా ఒక వారం లేదా రెండు వారాలు ఆలస్యంగా రానుందని సమాచారం. అక్టోబర్ 9, అక్టోబర్ 16.. ఈ రెండిట్లో ఏదో ఒక తేదీని లాక్ చేసే పనిలో ప్రస్తుతం మూవీ టీమ్ ఉందట. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని.. అక్టోబర్ 16 వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఇప్పటికే అక్టోబర్ 16 పై విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీ కర్చీఫ్ వేసింది. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' కూడా అదే డేట్ ను లాక్ చేస్తే.. ఓ వైపు పీరియడ్ యాక్షన్ డ్రామా, మరోవైపు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో దసరా బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారనుంది.
కాగా, 'ఆదర్శ కుటుంబం'లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
[Aadarsha Kutumbam, Postponed, Venkatesh, Trivikram, Vijay Deverakonda, Ranabaali, Telugu Cinema News, Telugu News]





