Home

»

Latest News

`అమెరికా అల్లుడు`గా సుమ‌న్ అల‌రించి నేటికి 37 ఏళ్ళు!

Jun 7, 2022 2:25PM

తెలుగు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన జంట‌ల్లో సుమ‌న్ - భానుప్రియ జోడీకి ప్ర‌త్యేక స్థాన‌ముంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జ‌న‌రంజ‌క చిత్రాల్లో `అమెరికా అల్లుడు` ఒక‌టి. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమాకి కె. వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. చికాగో ఫిల్మ్స్ ప‌తాకంపై వేమూరి ర‌మేశ్ నిర్మించారు. వేల్చేరు నారాయ‌ణ‌రావు క‌థ‌ను అందించ‌గా, స‌త్యానంద్ సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

క‌థ విష‌యానికి వ‌స్తే,  చికాగోలో గుర్తింపు పొందిన డాక్ట‌ర్ రాజు (సుమ‌న్).. ప‌ల్లెటూరికి చెందిన త‌న మ‌ర‌ద‌లు రాధ (భానుప్రియ‌)ని పెళ్ళాడ‌తాడు. అయితే, రాధ పాశ్చాత్య జీవ‌న‌శైలికి స‌ర్దుబాటు కాలేక రాజుని త‌రుచుగా అసౌక‌ర్యానికి గురిచేస్తూ ఉంటుంది. అదే స‌మ‌యంలో.. రాధ చేసిన ఓ పొర‌పాటు వ‌ల్ల రాజు ఆస్ప‌త్రిలో ఓ రోగి చ‌నిపోతాడు. దీంతో.. రాధ‌ని విడిచి పెడ‌తాడు రాజు. ఈ క్ర‌మంలో.. చివ‌రికి రాజు, రాధ ఎలా ఒక్క‌ట‌య్యారు అన్న‌దే మిగిలిన సినిమా.

కాంతారావు, కిమ్, తంబు, సూర్య‌కాంతం, డ‌బ్బింగ్ జాన‌కి, కె. వాసు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన `అమెరికా అల్లుడు`కి చ‌క్ర‌వ‌ర్తి బాణీలు క‌ట్ట‌గా వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి సాహిత్య‌మందించారు. 1985 జూన్ 7న విడుద‌లై కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న‌ `అమెరికా అల్లుడు`.. నేటితో 37 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com