Home

»

Latest News

`ఆర్య‌`గా అల్లు అర్జున్ అల‌రించి నేటికి 18 ఏళ్ళు!

May 7, 2022 1:05PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల్లో `ఆర్య‌` ఒక‌టి. `గంగోత్రి` (2003)తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగేసిన బ‌న్నీకి..  రెండో చిత్ర‌మైన `ఆర్య‌` అత‌ని కెరీర్ లో ట‌ర్నింగ్ పాయింట్ లా నిలిచింది. `వ‌న్ సైడ్ ల‌వ్` అనే కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ తోనే బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ మొద‌టిసారిగా మెగాఫోన్ ప‌ట్టారు. ``ఫీల్ మై ల‌వ్`` అంటూ కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌ని ఆవిష్క‌రించి తెలుగు కుర్ర‌కారుని ఫిదా చేశారాయ‌న‌. అల్లు అర్జున్ కి జంట‌గా అనురాధ‌ మెహ‌తా న‌టించిన ఈ చిత్రంలో శివ బాలాజీ, రాజ‌న్ పి. దేవ్, సుబ్బ‌రాజు, సునీల్, వేణుమాధ‌వ్, సుధ‌, విద్య, బ‌బ్లూ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. అభిన‌య‌శ్రీ ఓ ప్ర‌త్యేక గీతంలో త‌న చిందుల‌తో క‌నువిందు చేసింది. ఆర్. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం  ఈ సినిమాకి ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించిన ఈ చిత్రానికి వేటూరి సుంద‌రరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, చంద్ర‌బోస్, సురేంద్ర కృష్ణ, విశ్వ‌ సాహిత్య‌మందించారు. ``ఫీల్ మై ల‌వ్``, ``నువ్వుంటే``, ``అ అంటే అమ‌లాపురం``, `యూ రాక్ మై వ‌ర‌ల్డ్``, ``త‌క‌థిమితోం``, ``ఓ మై బ్ర‌ద‌ర్``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకున్నాయి. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై `దిల్` రాజు నిర్మించిన `ఆర్య‌`.. త‌మిళంలో `కుట్టి`, ఒడియాలో `పాగ‌ల ప్రేమి`, బెంగాలీ (బంగ్లాదేశ్)లో `బ‌ధ‌`,  సింహ‌ళ‌లో `అద‌ర‌యే న‌మ‌యేన్` పేర్ల‌తో రీమేక్ అయింది. 2004 మే 7న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన `ఆర్య‌`.. నేటితో 18 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com