Home

»

Latest News

`ఏక్ నిరంజ‌న్`గా ప్ర‌భాస్ ఎంట‌ర్టైన్ చేసి నేటికి 12 ఏళ్ళు!

Oct 29, 2021 3:25PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లోని న‌టుడ్ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుల్లో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన తొలి చిత్రం `బుజ్జిగాడు` (2008)తో ప్ర‌భాస్ అంద‌రికీ `డార్లింగ్` అయిపోయారు. ఆపై ఈ ఇరువురి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `ఏక్ నిరంజ‌న్` (2009) క‌మ‌ర్షియ‌ల్ గానూ మెప్పించింది. ఇందులో టైటిల్ రోల్ లో త‌న‌దైన అభిన‌యంతో ఎంట‌ర్టైన్ చేశారు ప్ర‌భాస్. అత‌నికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ఈ సినిమాలో సోనూ సూద్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, సంగీత‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ముకుల్ దేవ్, బ్ర‌హ్మానందం, అలీ, సునీల్, వేణు మాధ‌వ్, చ‌ల‌ప‌తిరావు, పోసాని కృష్ణ ముర‌ళి, బ్ర‌హ్మాజీ, స‌త్య‌ప్ర‌కాశ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు.

మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీల‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి, భాస్క‌ర‌భ‌ట్ల‌, విశ్వ సాహిత్య‌మందించారు. టైటిల్ సాంగ్ తో పాటు ``స‌మీరా స‌మీరా``, ``గుండెల్లో``, ``ఎవ‌రూ లేర‌ని అన‌కు``, ``మ‌హ‌మారి``, ``న‌ర్త‌న‌తార‌``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ సంగీత ప్రియుల‌ను ఆక‌ట్టుకున్నాయి. 2009 అక్టోబ‌ర్ 29న విడుద‌లై విజ‌యం సాధించిన `ఏక్ నిరంజ‌న్`.. నేటితో 12 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com