Home

»

Latest News

స్పైడర్‌కి రెండు క్లైమాక్స్‌లట..?

Apr 20, 2017 4:09PM

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. మహేశ్ తన కెరీర్‌లో తొలిసారిగా ద్విభాషా చిత్రంలో నటిస్తుండటం..ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ ఓ రేంజ్‌లో ఉండటంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. జూన్ 23న ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పక్కగా ప్లాన్ గీస్తోంది. దీనిలో భాగంగా షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు మురుగదాస్. ఈ సంగతి పక్కనబెడితే..తెలుగు రాష్ట్రాల్లో మహేశ్‌ను క్రేజ్‌కి ఏ మాత్రం ఢోకా లేదు.

కానీ తమిళనాడులో అంత సీన్ లేదు. చివరికి చెన్నైలోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే అంతంత మాత్రమే..దీంతో తమిళ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి మురుగదాస్ భారీ స్కెచ్ గీశాడు. స్పైడర్‌కి రెండు క్లైమాక్స్‌లు పెట్టాలని డిసైడయ్యాడు. తెలుగు వెర్షన్‌లో క్లైమాక్స్‌ని సాదాసీదాగా లాగించేసి..తమిళ్ వెర్షన్‌లో మాత్రం అదిరిపోయే క్లైమాక్స్‌ని షూట్ చేస్తున్నాడట. స్వతహాగా వెరైటీని ఇష్టపడే తమిళులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుందని మురుగదాస్ బలంగా నమ్ముతాడు. క్లైమాక్స్‌ బాగున్నంత మాత్రాన జనం సినిమా చూడటానికి వస్తారా..? రెండు క్లైమాక్స్‌లు ఉన్న విషయం కూడా కొంతమంది పుకారుగా కొట్టిపారేస్తున్నారు. మరి అసలు నిజం తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com