Home

»

Latest News

ఖైదీ వేట మొదలైతే ఖతమే.. శ్రీహరి నటవిశ్వరూపానికి సోషల్ మీడియా ఫిదా!

Apr 29, 2026

తెలుగు సినీ పరిశ్రమలో 'రియల్ స్టార్' అంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు శ్రీహరి. ఆయన డైలాగ్ డెలివరీ, కటౌట్, పవర్‌ఫుల్ యాక్టింగ్ ఎప్పటికీ మర్చిపోలేనివి. తాజాగా తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన గ‌ణ‌ప‌తి సినిమాలోని ప‌వ‌ర్‌ఫుల్ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన చెల్లెలికి అన్యాయం చేసిన పోలీసులను ఒక సామాన్యుడు ఎలా ఎదిరించాడు, దానికి ఒక తండ్రి పగ ఏ విధంగా తోడైందనేది ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది.

వీడియో ప్రారంభంలో తండ్రి తన కొడుకు గణపతికి (శ్రీహరి) అన్నం తినిపించే దృశ్యం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అది కేవలం ఆకలి తీర్చే అన్నం కాదు, కసిని పెంచే 'ప్రతీకారపు ముద్ద'. తన కళ్ల ముందే కూతురిని అవమానించిన ఐదుగురు పోలీసుల గుండెకాయలను పిండంగా అర్పించాలని ఆ తండ్రి కోరడం ప్రేక్షకులను కలచివేస్తుంది. తండ్రి కన్నీళ్లు, కొడుకు కళ్లలోని కసి వెరసి ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

జైలు అధికారిగా కోట శ్రీనివాసరావు, ఖైదీగా శ్రీహరి మధ్య జరిగే సంభాషణలు రోమాంచితంగా ఉంటాయి. "శిక్ష అనుభవించడానికో, పశ్చాత్తాపపడడానికో నేను రాలేదు సార్.. మోక్షం కలిగించడానికి వచ్చాను" అంటూ శ్రీహరి చెప్పే డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. అయ్యప్ప మాల వేసుకున్న జైలర్ ముందు తన ఆవేదనను వెళ్లగక్కడం, చివరకు ఆ అధికారి కూడా గణపతిలోని న్యాయాన్ని గుర్తించి వదిలేయడం ఈ సీన్ లోని అసలు మలుపు.

ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు శ్రీహరి నటనను కొనియాడుతున్నారు. మాస్ ఆడియన్స్‌కు ఏం కావాలో శ్రీహరికి బాగా తెలుసని, ఆయన గంభీరమైన గొంతు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎవరూ రీప్లేస్ చేయలేరని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులను ఊచకోత కోసే యాక్షన్ సీక్వెన్స్ శ్రీహరి మార్క్ 'మాస్ జాతర'ను గుర్తుచేస్తోంది.

నేటి తరం యాక్షన్ సినిమాలతో పోల్చినా, ఈ సీన్‌లోని ఎమోషన్ మరియు ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. రియల్ స్టార్ ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ తమ అభిమాన నటుడిని గుర్తుచేసుకుంటున్నారు. ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com