Home

»

Latest News

Allu Arjun: చాలా గర్వంగా ఉంది.. మంత్రులు, ప్రభుత్వ అధికారులకి కృతజ్ఞతలు

Apr 10, 2026

 

 

టుడే  ట్రెండింగ్ లో నిలిచిన అల్లు అర్జున్ పోస్ట్ 
ఫ్యాన్స్ ని చూస్తే గర్వంగా ఉంది
అసలు విషయమేంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి తన అభిమానులంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఈ విషయం చాలా సార్లు రుజువ్వడంతో పాటు వాళ్ళకి ఏ కష్టమొచ్చినా ఆర్ధికంగా సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అభిమానులు ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో నా అభిమానులని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ చేసిన అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ చేసే అవసరం లేకుండా టాక్ ఆఫ్ ది డే అయ్యి కూర్చుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

రీసెంట్ గా అల్లు అర్జున్ ఫాన్స్ 'హెచ్ పీవీ'(HPv)వ్యాక్సిన్ గురించి అవహగాన కార్యక్రమాలు చేపట్టింది. హెచ్ పీవీ అంటే ఆడవాళ్ళల్లో గర్భాశయ దశలో వచ్చే కాన్సర్ కణం. ఈ మేరకు ఎంతో మంది ఆడవాళ్లు ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఎవరు దాని బారిన పడకుండా బాలికలకి హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు.  దీనిపైనే అల్లు అర్జున్ పోస్ట్ చేసారు. అభిమానులు శక్తికి మించి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆనందంతో పాటు గర్వంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులకి కూడా అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.

also read: జననాయగన్ కోసం రంగంలోకి చిరంజీవి.. విజయ్ ఫ్యాన్స్ హ్యాపీ 

సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అట్లీ(Atlee)తో కలిసి ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 'రాకా'(Raaka)ని రెడీ చేస్తున్నాడు. ఇటీవల తన పుట్టిన రోజు (ఏప్రిల్ 8 ) సందర్భంగా వచ్చిన లుక్ 'రాకా' అంచనాలకి సరికొత్త వర్డ్ ని కనిపెట్టే పరిస్థితి కల్పించింది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రతి సంవత్సరం రెండు సినిమాలని రిలీజ్ చేస్తానని బర్త్ డే రోజు చెప్పాడు కాబట్టి ఈ రెండు చిత్రాలు 2027 లో అడుగుపెట్టడం తథ్యం. దీంతో 2027 అల్లు ప్రభంజన నామసంవత్సరంగా మారడం కూడా తథ్యం.

              ?

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com