Home

»

Latest News

డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదగా 'జయహో జనార్ధన' టైటిల్ పోస్టర్ లాంచ్

Apr 10, 2026

నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'జయహో జనార్ధన'(Jayaho Janardhana). పానుగంటి ప్రొడక్షన్స్  బ్యానర్ లో రూపొందుతోంది. పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లాంచ్ ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది(Sampath Nandi) చేతుల మీదుగా జరిగింది. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి.

పోస్టర్ లాంచ్ తర్వాత సంపత్ నంది గారు మాట్లాడుతూ.. నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి ని మరియు మూవీ టీంని అభినందించి, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

'జయహో జనార్ధన' సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, BVM శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 

ఈ సినిమాకి ఎడిటర్ గా నందమూరి హరి, కెమెరామెన్ గా విజయ్ ఠాగూర్, ఆర్ డైరెక్టర్ గా భూపతి యాదగిరి పనిచేయగా మ్యూజిక్ అందించింది చరణ్ అర్జున్. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com