Home

»

Latest News

ప్రముఖ అగ్ర నటుడు మృతి.. 34 ఏళ్ళే కావడంతో తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్ 

Oct 13, 2026 2:15PM


హాలీవుడ్ టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కల్ట్ క్లాసిక్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' (Breaking Bad) ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న  నటుడు ఆర్జే మిట్టె .   టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో నిన్న సోమవారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు.ఈ విషాద వార్తతో హాలీవుడ్ ప్రముఖులు, ఆయన సహనటులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్‌లో ఆర్జే మిట్టె  పోషించిన 'వాల్టర్ వైట్ జూనియర్' (Walter White Jr.)క్యారక్టర్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సిరీస్ మొత్తం 5 సీజన్‌లలోనూ కొనసాగి, బ్రయాన్ క్రాన్స్టన్ (Bryan Cranston) కుమారుడిగా ఆయన నటించిన 56 ఎపిసోడ్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. నిజ జీవితంలో కూడా సెరిబ్రల్ పాల్సీ (Cerebral Palsy) అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన, తన నటన ద్వారా ఆ క్యారక్టర్ కి  అద్భుతమైన ప్రాణం పోశారు. తెరపై ఆయన ప్రదర్శించిన హావభావాలు, నిజాయితీతో కూడిన నటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకి  ఎంతో స్ఫూర్తినిచ్చాయి.

కేవలం నటుడిగానే కాకుండా, దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన యోధుడిగా కూడా ఆర్జే మిట్టె ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హాలీవుడ్‌లో వికలాంగులకు సముచితమైన ప్రాతినిధ్యం లభించేలా ఆయన గళం విప్పారు. 'యునైటెడ్ సెరిబ్రల్ పాల్సీ' ఫౌండేషన్‌కు సెలబ్రిటీ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు, 'మిట్టే ఫౌండేషన్' (Mitte Foundation) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సమాజంలో దివ్యాంగులపై ఉండే వివక్షను రూపుమాపడానికి, వారికి సమాన అవకాశాలు కల్పించడానికి  జీవితాంతం కృషి చేశారు.


ఇది కూడా చదవండి: నాని సరసన ఎన్టీఆర్ బ్యూటీ: ఫ్యాన్స్ లో పెరిగిన అంచనాలు! 

ఆయన ఆకస్మిక మృతి పట్ల 'బ్రేకింగ్ బ్యాడ్' సహనటులు బ్రయాన్ క్రాన్స్టన్, ఆరోన్ పాల్, డీన్ నారిస్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్వేగ నివాళులు అర్పించారు. అయితే  కేవలం 34 సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  

 

[Rj Mitte Passes Away, RJ Mitte, Breaking Bad, Walter White Jr, Hollywood actor, cerebral palsy, RJ Mitte passes away, Hollywood, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com