Home

»

Latest News

హైపర్ ఆదికి కోపం వచ్చింది.. ఒక వ్యక్తికి సీరియస్ వార్నింగ్.. వైరల్ అవుతున్న వీడియో

Apr 05, 2026


హైపర్ ఆది అంటే అందరికీ తెలిసిందే. నాన్ స్టాప్ పంచ్ లకు పెట్టింది పేరు. ఎప్పుడూ నవ్వుతూ తన చుట్టు పక్కల వారిని నవ్విస్తూ ఉండే ఆదికి కోపం వచ్చింది. ఇపుడు దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయిన ఆది ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక వ్యక్తిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే హైపర్ ఆది, ఒక బహిరంగ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు ఈ ఘటన జరిగింది. వీడియోలో ఆది స్టేజ్ దిగి వచ్చి మరీ ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. అతనికి సీరియస్ వార్నింగ్ ఇస్తూ కనిపించారు. చుట్టూ పోలీసులు, జనం ఉన్నా లెక్కచేయకుండా ఆది అంతలా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఆది అంతగా రియాక్ట్ అయ్యారంటే ఎదుటి వ్యక్తి కచ్చితంగా రెచ్చగొట్టి ఉంటాడు" అని కొందరు ఆదికి మద్దతు తెలుపుతుండగా, అసలు అక్కడ ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్పటిదా? లేక పాతదా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆది టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ వీడియో వైరల్ కావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com