Home

»

Latest News

Pony verma: ప్రకాష్ రాజ్ వైఫ్ పోనీ వర్మ సంచలనం.. సాడ్ సంఘటన జరిగినా పట్టించుకోలేదు 

Jun 15, 2026 9:52PM

 


ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచేలా చేసే సత్తా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్(Praksh Raj). ఈ రోజు సమంత టైటిల్ రోల్ లో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.

మా ఇంటి బంగారంలో పోనీ వర్మ(pony verma)తస్సాదియ్యా సాంగ్ కి డాన్స్ మాస్టర్ గా చేసింది. సాంగ్ వింటున్నా, ప్రచార చిత్రాల్లో చూస్తున్నా సాంగ్ కంపోజ్ హైలెట్ అవుతుందని అర్ధమవుతుంది. ఫంక్షన్ లో తస్సాదియ్యా సాంగ్ కి సమంత డాన్స్ చేసిందంటే సాంగ్ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ లో మా ఇంటి బంగారాన్ని తెరక్కించిన నందిరెడ్డి మాట్లాడుతూ పోనీ ఇంట్లో   సాడ్ సంఘటన జరిగినా సాంగ్ తెరకెక్కించిందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also read: Samantha: బాలయ్య సాంగ్ తో గత్తర లేపుతున్న సమంత 

పోనీ వర్మ హిందీ చిత్రపరిశ్రమకి  చెందిన డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌.  అసలు పేరు రష్మీ వర్మ.  కలర్స్ ఛానెల్‏లో ప్రసారమైన ‘చక్ ధూమ్ ధూమ్’ డ్యాన్స్‌ రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరించింది.  ప్రకాశ్‌ రాజ్, పోనీ వర్మ మ్యారేజ్ 24 ఆగస్టు 2010న ‏జరిగింది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com