Home

»

Latest News

Nagachaitanya: అక్కినేని ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్.. చైతు లైనప్ ప్రాజెక్ట్స్ ఇవే 

Apr 13, 2026

 

 

-తండేల్ తో హిట్ మోడ్ సొంతం చేసుకున్న చైతు 
 -వృషకర్మ పై ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ 
-మరి ఆ తర్వాత చిత్రాలు ఏంటి
-తగ్గేదేలే అనే విధంగా డిఫరెంట్ లైనప్ 


తండేల్.. యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya),అక్కినేని ఫ్యాన్స్ కి స్వీట్ సుపారీ లాంటి మూవీ.  చైతు తన స్టార్ స్టేటస్ ని కూడా  రెట్టింపు చేసుకున్నాడు. దీంతో  విరూపాక్ష డైరెక్టర్ 'కార్తీక్ దండు'(karthik dandu)తో చేస్తున్న అప్ కమింగ్ మూవీ 'వృషకర్మ'(Vrushakarma)పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలైతే హిట్ ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయి. రిలీజ్ డేట్ త్వరలోనే రానుంది. ఈ చిత్రం సెట్స్ పైనే ఉండగానే రెండు వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ ని సిద్ధం చేస్తున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో క్రేజీ న్యూస్ గా మారింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.


నాగార్జున(Nagarjuna),డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ(Kalyan krishna)కాంబోలో మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ కాంబోలో ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. చైతు బంగార్రాజులో అయితే తండ్రి నాగార్జున కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని   ఫ్యాన్స్, ప్రేక్షకులకి  అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇప్పుడు నాగ్ చిత్రంలో చైతు ఒక కీలకమైన క్యారక్టర్ లో చేస్తున్నాడని తెలుస్తుంది. కథని మలుపు తిప్పే క్యారక్టర్ అనేది కూడా  టాక్. ఇక ఆ తర్వాత ఆ వెంటనే తన 25 వ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడు. బెదురులంక 2012 డైరెక్టర్ క్లాక్స్ దర్శకుడు. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ న్యూస్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు.

also read: Sardar 2: సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తండేల్ కంప్లీట్లీ యాక్షన్ డ్రామా, వృషకర్మ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్, కళ్యాణ్ కృష్ణ ట్రాక్ రికార్డు చూసుకుంటే నాగ్ మూవీ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్, క్లాక్స్  మూవీ చూసుకుంటే  లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్. మరి డిఫరెంట్ సబ్జెట్స్ తో కూడిన లైనప్ చూస్తుంటే నాగ చైతన్య సిల్వర్ స్క్రీన్, బాక్స్ ఆఫీస్ పై తన జెండా పాతడం ఖాయమని అనిపిస్తుంది. 

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com