Home

»

Latest News

Sardar 2: సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

Apr 13, 2026

 

-స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ సాధించిన విజయం తెలిసిందే
-దీంతో సర్దార్ 2 పై భారీ అంచనాలు 
-గత ఏడాదే షూటింగ్ స్టార్ట్ 

వరుస పరాజయాలు కార్తీ(Karthi)సినీ కెరీర్ ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ప్రీవియస్ మూవీ అన్నగారు వస్తున్నారు అయితే మరి దారుణం. ఫైనాన్షియల్ సమస్యలతో లేట్ రిలీజ్ అవ్వడంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలని మిగిల్చింది. దీంతో కార్తితో పాటు అభిమానుల ఆశలు సర్దార్ 2(Sardar 2)పైనే ఉన్నాయి. కోలీవుడ్ సర్కిల్స్ లో సర్దార్ 2 లేటెస్ట్ న్యూస్ వినపడటం లేదు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.


 2022లో వచ్చిన స్పై డ్రామా 'సర్దార్' సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తెలుగులోను  సాలిడ్ హిట్ తో పాటు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది. పార్ట్ 2 కూడా ఉందని మేకర్స్ చెప్పడంతో సర్దార్ అభిమానులు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది సర్దార్ 2 షూటింగ్ స్టార్ట్ అవ్వగా మార్చిలో మైసూర్ లో ఒక ఫైట్ షూట్ చేస్తుండగా కార్తీ కాలికి గాయం తగిలి బ్రేక్ వేశారు. తర్వాత స్టంట్ మ్యాన్ ఏలుమలై ఒక చేజింగ్ సీన్ చేస్తుండగా చనిపోయాడు. దీంతో షూట్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత సర్దార్ 2  నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తొంబై శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తమిళ సినీ సర్కిల్స్ లో టాక్ వినపడుతుంది.


Also Read:  Tollywood: ఎందుకిలా చేస్తున్నారు

కార్తీ సరసన మాళవిక మోహనన్(Malavika Mohanan), ఆషిక రంగనాథ్(Ashika Ranganath)జత కట్టగా ఎస్ జె సూర్య, రజిష విజయన్  యోగిబాబు, విటివి గణేష్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. అజర్ బైజాన్, బ్యాంకాక్, కజకస్తాన్ లాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున యాక్షన్ ఎపిసోడ్లు చేశారు. దీన్ని బట్టి సర్దార్ 2 క్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు మాత్రం సర్దార్ 2 అప్ డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.పిన్స్ పిక్చర్స్, ఐవి ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సారధ్యంలో మిత్రన్(Mithran) తెరకెక్కించాడు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com