Home

»

Latest News

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ రీమేక్‌తో దేవయాని కుమార్తె హీరోయిన్‌గా ఎంట్రీ!

Apr 07, 2026

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి దేవయాని(Devayani) తన నటనతో అప్పట్లో ఒక ఊపు ఊపారు. 'ప్రేమలేఖ', 'సుస్వాగతం' వంటి చిత్రాలతో హోమ్లీ హీరోయిన్‌గా అందరి మనసు గెలుచుకున్న ఆమె.. ఇప్పుడు తన వారసురాలిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. 

దేవయాని, దర్శకుడు రాజకుమారన్ దంపతుల కుమార్తె ప్రియాంక రాజకుమారన్(Priyanka Rajakumaran).. టాలీవుడ్ హిట్ సినిమా రీమేక్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. సీనియర్ యాక్టర్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ద్వారా ఆమె వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ప్రశాంత్ 53వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి 'రంజన్: ది అడ్వకేట్'(Ranjan) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. గతేడాది తెలుగులో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' (Court: State vs. A Nobody) సినిమాకి ఇది అధికారిక తమిళ రీమేక్. 

తెలుగులో ప్రియదర్శి పోషించిన అడ్వకేట్ పాత్రను తమిళంలో ప్రశాంత్ పోషిస్తున్నారు. తెలుగులో శ్రీదేవి పోషించిన పాత్రలో ప్రియాంక రాజకుమారన్ కనిపించనుంది. ప్రముఖ నిర్మాత కతిరేసన్ కుమారుడు హరి కూడా ఇందులో నటిస్తున్నాడు. రోషన్ పాత్రలో అతను కనిపించనున్నాడు.

ఈ సినిమా లాంచ్ కార్యక్రమంలో దేవయాని తన కుమార్తె ఎంట్రీ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు ప్రశాంత్ సరసన తాను హీరోయిన్‌గా 'అప్పు' వంటి హిట్ చిత్రాల్లో నటించానని, ఇప్పుడు తన కుమార్తె అదే ప్రశాంత్ సినిమాలో ఒక ముఖ్య పాత్రతో పరిచయం కావడం విశేషమని ఆమె పేర్కొన్నారు. 

పోక్సో చట్టం గురించి అవగాహన కలిగించేలా సాగే ఈ కోర్టు రూమ్ డ్రామాకు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సోషల్ మీడియాలో దేవయాని కుమార్తె ఫోటోలు చూసిన నెటిజన్లు.. "అచ్చు దేవయానిలాగే ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేవయాని వారసత్వాన్ని ప్రియాంక ఎంతవరకు కొనసాగిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఎన్టీఆర్ దెబ్బ తగిలినా ఆగలేదు.. పాలిటిక్స్‌పై వి.వి. వినాయక్ షాకింగ్ కామెంట్స్!

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com