Home

»

Latest News

మ్యాజిక్ రిపీట్ అవుతుందా!.. మన శంకర వరప్రసాద్ గారుని దాటుతాడా!

Jun 21, 2026 5:28PM

మొన్న 18 వ తారీఖున విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ ల మూవీ అధికారకంగా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో అంచనాలు స్థాయి ఒక రేంజ్ లో ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ తో 300 కోట్ల క్లబ్ లోకి చేరిన అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకీ, కళ్యాణ్ రామ్ తో కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటాడా అనే చర్చ అభిమానులు, సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. మరి మూవీ విశేషాలేంటో చూద్దాం.


ఈ  చిత్రం కోసం అనిల్ రావిపూడి ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేశారు. వెంకటేశ్‌తో అనిల్ రావిపూడికి ఇది ఐదో సినిమా (F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు తర్వాత). అలాగే తొలి చిత్రం పటాస్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కల్యాణ్ రామ్‌తో చేస్తున్న రెండో సినిమా. దీంతో తన మార్క్  క్లీన్ హ్యూమర్, బలమైన ఎమోషన్స్, మరియు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అనిల్ రావిపూడి కథని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. 

 కాస్టింగ్ పరంగా కూడా మేకర్స్ చాలా కేర్ తీసుకున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కథానాయికగా నటిస్తుండగా, యంగ్ అండ్ బ్యూటిఫుల్ కృతి శెట్టి కల్యాణ్ రామ్ జోడీగా నటిస్తోంది. ఈ విలక్షణమైన కాంబినేషన్ వెండితెరపై సరికొత్త కలర్‌ఫుల్ వైబ్‌ను తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు నేషనల్ అవార్డ్ గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా అనిల్ రావిపూడి, జి.వి. ప్రకాష్ కలిసి చేసిన ఒక ఫన్నీ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.

Also read: Prakash Raj: ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. సినీ వర్గాల్లో సంచలనం

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తుండగా, జీ స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ప్రేక్షకులకు అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ అధికారికంగా డేట్ లాక్ చేశారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసివచ్చే సీజన్ కావడంతో, ఈ మల్టీస్టారర్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com