Home

»

Latest News

Toxic: టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారకంగా ప్రకటించిన యష్ 

Jun 21, 2026 3:45PM

 

ఇప్పుడు యష్(Yash)అభిమానులందరు 'ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే అనే సాంగ్ పాడుకుంటూ మస్త్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే  'టాక్సిక్'(Toxic)విడుదలపై వాళ్ళల్లో ఉన్న సస్పెన్స్, ఉత్కంఠత కి తెరపడింది. గత కొన్ని నెలలుగా వరుస వాయిదాలతో అభిమానులను తీవ్ర నిరీక్షణకు గురిచేసిన ఈ పాన్-ఇండియా చిత్రం, ఇప్పుడు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసుకుంది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు  యష్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా 'నీ తండ్రిని గౌరవించు.. టాక్సిక్ ఆగస్టు 26, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది" అని  ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందంతో ఉన్నారు.

ఈ సరికొత్త పోస్టర్‌లో యష్ రాయ, టికెట్ అనే విభిన్నమైన లుక్స్‌లో తండ్రీకొడుకులుగా రెండు పవర్‌ఫుల్ రోల్స్ లో కనిపించి కనువిందు చేశారు. మొదట మార్చి 19న విడుదల చేసి రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' చిత్రంతో పోటీ పడేలా ప్లాన్ చేశారు. అయితే, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య తలెత్తిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధ వాతావరణం కారణంగా ఓవర్సీస్ పంపిణీ దెబ్బతినే అవకాశం ఉండటంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా కంటెంట్‌ను సినిమాకాన్ ఈవెంట్‌లో అంతర్జాతీయ బయ్యర్లకి  ప్రదర్శించినప్పుడు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి, దీనిని మరింత భారీ స్థాయిలో అంతర్జాతీయంగా విడుదల చేయాలని  భావించారు. ఇందుకోసం డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడానికి మరింత సమయం పడుతుండటంతో మేకప్స్ జూన్ విడుదలని  వాయిదా వేయాల్సి వచ్చింది.

Also read: Prabhas: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. హైప్ తో పోతే ఎవరిదీ బాధ్యత


ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఇప్పుడు 2026 ఆగస్టు 26 న  ఫైనల్ రిలీజ్ డేట్‌గా లాక్ చేశారు. ఈ సరికొత్త బుధవారం విడుదల తేదీ సినిమాకి  భారీ ప్లస్ కానుంది. ఎందుకంటే ఆ సమయంలో వరలక్ష్మి వ్రతం, ఓనం, ఈద్ మరియు రక్షాబంధన్ వంటి వరుస పండుగల సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. 'కేజీఎఫ్ 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 4 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యష్ చేస్తున్న చిత్రం కావడంతో  అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

ఈ భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, యష్ కూడా కథా రచనలో భాగస్వామిగా ఉండటంతో పాటు ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మించాడు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీ రోల్స్.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com