
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఏ హీరో కూడా చేయని విధంగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సదరు చిత్రాలన్నీ సెట్స్ పైనే ఉన్నాయి.
అలాంటి వాటిల్లో ఒకరి సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న 'స్పిరిట్' ఒకటి. ఈ మూవీపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసిన 'యానిమల్' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ హై-వోల్టేజ్ క్రైమ్ డ్రామా షూటింగ్ తెలంగాణలో అత్యంత వేగంగా, నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం మేకర్స్ దాదాపు రెండు నెలల పాటు సాగే ఒక పవర్‌ఫుల్ లాంగ్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్ షెడ్యూల్ కోసం చిత్రబృందం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుని వేదికగా ఎంచుకుంది. ఈ రోజు జైలు పరిసరాల్లో ప్రభాస్‌పై కొన్ని కీలకమైన, అత్యంత ఇంటెన్స్ సీన్లని చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా గ్ ప్రభాస్ ఈ షూటింగ్‌లో పాల్గొనడం విశేషం.
ఇప్పటికే కొంపల్లి, అజీజ్‌నగర్, కోటి ఉమెన్స్ కాలేజీతో పాటు బాలానగర్‌లోని ప్రముఖ 40 ఏళ్ల నాటి ఐకానిక్ సింగిల్ స్క్రీన్ 'విమల్ థియేటర్'లో కీలక షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ వస్తున్నారనే విషయం లీక్ అవ్వడంతో వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. క్రౌడ్ కంట్రోల్ కోసం భారీ ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు స్థానిక పోలీసులను కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇప్పుడు చంచల్‌గూడ జైలు వద్ద కూడా ప్రభాస్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టారు. షూటింగ్ లొకేషన్ నుండి ఒక క్రేజీ షాడో పిక్ కూడా లీకై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also read: Rhea kapoor: అనిల్ కపూర్ కుమార్తె డైమండ్ ఇయర్ రింగ్స్ చోరీ.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ గ్యారంటీ
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా చేస్తుండగా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ విలన్ రోల్ లో చేస్తున్నాడు.హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ని అందిస్తుండగా టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2027 మార్చి 5వ రిలీజ్ డేట్ .






.webp)
