Home

»

Latest News

Mahavatar: మహావతార్ లో శ్రద్ధాకపూర్..గోల్డెన్ ఆఫర్ కానుందా!

Apr 11, 2026

 

 

-విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో మహావతార్ 
-పరశురాముడుగా విక్కీ 
-ప్రచార చిత్రాలతో వైరల్
-శ్రద్ధాకపూర్ పేరు పరిశీలనలో 

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)డార్లింగ్ గా సాహూలో చేసి మెప్పించిన భామ శ్రద్దా కపూర్(Shraddha Kapoor). కల్కిలోను మెరిసి తన అందంతో ప్రభాస్ నే కాకుండా అభిమానులని, ప్రేక్షకులని కట్టి పడేసింది. హోమ్లీ లుక్ స్క్రీన్ ప్రెజన్స్ తన ప్రధాన బలం.ఎలాంటి హడావిడి, టెన్షన్ లేకుండా తన క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఉన్న చిత్రాల్లోనే చేస్తు తన కట్ అవుట్ రేంజ్ ని ఎలివేట్ చేసుకుంటు వస్తుంది. 2024 లో సూపర్ డూపర్ హిట్ అందుకున్న స్త్రీ 2 తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి మూవీని ఒప్పుకోలేదంటే ఆమె నిబద్దతని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఖాతాలోకి తనంతట తానుగా వచ్చి ఒక మూవీ చేరిందనే న్యూస్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

'చావా'గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న విక్కీ కౌశల్(Vicky Kaushal)మహావతార్' అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ శ్రద్ద కపూర్ ని పరిశీలిస్తున్నారనే న్యూస్ 'బి టౌన్' సర్కిల్స్ లో అత్యంత వాల్యుబుల్ న్యూస్ గా చక్కర్లు కొడుతుంది. మరి విక్కీ కౌశల్ తో శ్రద్ధ జత కట్టడం ఖాయమైతే మహావతార్ కి అదనపు శక్తి సమకూరినట్టే. పైగా ఆ ఇద్దరి ఫస్ట్ కాంబో కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులకి నయనానందం కలగడం పక్కా. శ్రద్ధ ప్రస్తుతం 'ఏతా' అనే మరో మూవీ కూడా చేస్తుంది.


Also read: Shah rukh khan vs ranveer singh: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణవీర్ సింగ్ 

మహావతార్(Mahavatar)విషయానికి వస్తే మాములు అల్లా టప్పా సబ్జెట్ తో తెరకెక్కడం లేదు. త్రేతాయుగం ఆరంభంలోని  శ్రీమహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముడు(Parasuramudu)అవతారం నేపథ్యంలో తెరకెక్కుతుంది. జమదగ్ని మహర్షి, రేణుకా దేవి కడుపున జనియించిన పరశురాముడు దుష్ట శక్తుల నుంచి భూమిని రక్షించి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన గొడ్డలితో 21 సార్లు దండెత్తి అధర్మపరులని సంహరించాడు ఏడుగురు చిరంజీవులలో ఒకరు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కల్కికి గురువు. చావాని నిర్మించిన మాడాక్ సంస్థనే నిర్మిస్తుండగా ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి.
 

 

  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com