
ఎదురే లేదంటూ దూసుకుపోతున్న ధురంధర్ 2
ఇప్పటికే 1650 కోట్ల గ్రాస్ దాకా వసూలు
మరి మోదీ ఏం అంటున్నారు
ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడు
దేనోడు దానికే ఉంటాడనేది సామెతకి తగ్గట్టే ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)ని పొగిడే వాళ్ళు ఉంటే, విమర్శించే వాళ్ళు ఉన్నారు. ప్రెజెంట్ పొగిడే వ్యకి మన దేశ ప్రధాన మంత్రి మోదీ(Modi) అయితే, ప్రెజెంట్ విమర్శించే వ్యక్తి లెజండ్రీ యాక్టర్ ప్రకాష్ రాజ్(Prakash Raj)ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకర్ని పొగడడానికి, మరొకర్ని విమర్శించడానికి మనం ఎవరం కాబట్టి జరుగుతున్న విషయాల గురించి మాత్రమే చెప్పుకుందాం.
రీసెంట్ గా ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతు నిజాలని అంగీకరించ లేకే కొంతమంది 'ధురంధర్ 2 పై ‘ప్రోపగాండా’విమర్శలు చేస్తున్నారు. గతంలో ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ’ లపై కూడా ఇలాగే తప్పుడు ప్రచారం చేసారని చెప్పిన మోదీ ధురంధర్ 2 లో 2016 లో తాను రద్దు చేసిన నోట్ల రద్దు అంశాన్ని ఉపయోగించడం, ఆ టైంలో నోట్ల రద్దు అనంతరం తదితర పరిణామాలకి సంబంధించి నిజమైన ఫుటేజ్ ఉపయోగించడాన్ని కూడా మోదీ ప్రస్తావించారు.
Also read: Rajasekhar: రాజశేఖర్ దశ తిరగబోతుందా!
ఎక్స్ వేదికగా మోదీ వీడియోని షేర్ చేసిన ప్రకాష్ రాజ్' సొంతంగా నిర్మించిన సినిమాలని సెల్ఫ్ డబ్బా గా ప్రమోట్ చేసుకోవడం కరెక్టేనా? అంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చలకి కూడా దారి తీస్తుంది. ఏది ఏమైనా బంగాళా ఖాతంలో వాయుగుండం పడి తీరం దాటాక ఫలితం లేదనేలా ఎవరు ధురంధర్ ని పొగిడినా, విమర్శించినా ధురంధర్ 2 కి కొత్తగా ఒరిగేదేమి లేదు. ఇప్పటికే సుమారు 1650 కోట్ల గ్రాస్ ని రాబట్టి సరికొత్త ఫిగర్ ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి పరిచయం చెయ్యాలనే ఆత్రుతతో ఉన్నాడు.






