Home

»

Latest News

Peddi: ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ గ్రౌండ్ లో క్లౌడ్ ఇంతే.. హైదరాబాద్ లో జరిపి ఉంటే!

Jun 1, 2026 7:31PM

 

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్(Ram Charan)నుంచి వస్తున్న  మోస్ట్ అవేటెడ్ పాన్ ఇం డియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'(Peddi). 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో, క్రీడల ద్వారా ఒక సామాన్యుడు తన గ్రామాన్ని ఎలా ఏకం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు  విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ  మున్సిపల్ స్టేడియంలో కొద్దీ సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి.

 ఈ మెగా వేడుకకి అభిమానులతో పాటు అశేష జనవాహిని తరలివచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుండే విజయవాడ నగర వీధులన్నీ మెగా అభిమానుల నినాదాలతో మారుమోగిపోయాయి. స్టేడియం సామర్థ్యానికి మించి వేలాది మంది అభిమానులు తరలిరావడంతో బెజవాడలో ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. ఇతర జిల్లాల నుండి దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు ఈ చారిత్రాత్మక క్షణాన్ని కళ్లారా చూసేందుకు విజయవాడకి  చేరుకోవడం ఈ ఈవెంట్ రేంజ్‌ను చూపిస్తోంది. ఈవెంట్ ప్రారంభమైన కాసేపటికే స్టేడియం లోపల ఉన్న గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి. దీంతో చరణ్ తన  స్టామినా ఏ పాటిదో మరో సారి చాటి చెప్పినట్లయింది.

Also read: Dhurandhar: ధురంధర్ పై దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఆగ్రహం..ముంబైలో భారీ ఉగ్రకుట్రకి ప్లాన్ 

ఆ పబ్లిక్ ని చూసిన తర్వాత హైదరాబాద్ లో రెగ్యులర్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో అయితే సరిపోయేది కాదని సినీ పరిశీలకులు అంటున్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ స్పీచ్ తో పాటు మిగతా నటీనటులు, దర్శకుడు ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com