Home

»

Latest News

Zayn Marie Khan: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ.. ఎవరీ జైన్ మేరీ ఖాన్?

Apr 07, 2026

  • అమీర్ ఖాన్ మేనకోడలి గ్లామర్ షో
  • 'డెకాయిట్' ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన జైన్ మేరీ ఖాన్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్‌లో అప్పుడప్పుడు కొంతమంది బ్యూటీలు మెరుపు తీగల్లా మెరిసి, కుర్రకారు మనసు దోచుకుంటారు. తాజాగా 'డెకాయిట్'(Dacoit) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఒక కొత్త పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో మార్మోగిపోతోంది. ఆ పేరే జైన్ మేరీ ఖాన్(Zayn Marie Khan). అడవి శేష్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్స్ ఉన్న ఈ ఈవెంట్‌లో అందరి కళ్లు ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ వైపు మళ్లాయి. తన అదిరిపోయే అవుట్‌ఫిట్, కాన్ఫిడెంట్‌తో ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. 

జైన్ మేరీ ఖాన్ వెనుక ఒక పెద్ద సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు ఈమె స్వయానా మేనకోడలు. అలాగే ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తె. హిందీలో ఇప్పటికే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా రాని గుర్తింపు, కేవలం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒక్క ఈవెంట్‌తో వచ్చేసింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అడవి శేష్ హీరోగా వస్తున్న 'డెకాయిట్' సినిమాతో జైన్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. విశేషం ఏంటంటే, ఇందులో ఆమె ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. ట్రైలర్‌లో తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించిన జైన్, ఈవెంట్‌కు వచ్చేసరికి మాత్రం పూర్తి గ్లామర్ అవతారంలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్క్రీన్ మీద రగ్గడ్ పోలీస్ గా చూసిన జనం, బయట ఆమె గ్లామర్ చూసి ఫిదా అయిపోతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జైన్ మేరీ ఖాన్ ఫోటోలు, వీడియోలే చక్కర్లు కొడుతున్నాయి. మృణాల్ ఠాకూర్ వంటి క్రేజీ హీరోయిన్ పక్కన ఉన్నా సరే, తన ప్రత్యేకతను చాటుకోవడంలో జైన్ సక్సెస్ అయ్యింది. నెటిజన్లు ఆమెను 'టాలీవుడ్ కొత్త క్రష్' అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే ఇంత పాపులారిటీ రావడంతో అటు చిత్ర యూనిట్, ఇటు జైన్ ఖాన్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారట.

'డెకాయిట్' సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. అడవి శేష్ సినిమాలు అంటేనే ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో జైన్ మేరీ ఖాన్ వంటి టాలెంటెడ్ అండ్ గ్లామరస్ బ్యూటీని పరిచయం చేయడం మరో విశేషం. మరి డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, అలాగే ఈ సినిమా జైన్ కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా, సినిమా విడుదల కాకముందే జైన్ మేరీ ఖాన్ మాత్రం తెలుగు ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేసింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com