Home

»

Latest News

Balakrishna: ఇదే ఫస్ట్ టైం అనుకుంటా.. అదరగొడుతున్న NBK 111  గ్లింప్స్‌

Jun 10, 2026 6:38PM

 

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ NBK 111  గ్లింప్స్‌ అలా రిలీజ్ అయ్యిందో లేదో  రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.  గ్లింప్స్‌ ఎట్మాస్పియర్ చూస్తుంటే బాలయ్య మాఫియా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నాడనే విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య తన  కెరీర్ లోనే మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో చెయ్యడం ఫస్ట్ టైం అని చెప్పవచ్చు. యాక్షన్ సీక్వెన్స్ కూడా హై రేంజ్ లో ఉండబోతున్నాయని అర్ధమవుతుంది.


 గ్లింప్స్‌ లో ఎలాంటి డైలాగ్స్ లేవు. బాలయ్య నుంచి ఇప్పటి వరకు వచ్చిన మూవీ  ప్రమోషన్స్ ని గమనిస్తే  డైలాగ్ రిలీజ్ అయ్యేది. సదరు డైలాగ్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండి సినిమాపై అంచనాలని పెంచడంతో పాటు సినిమా వచ్చే వరకు ఆ డైలాగ్ ఫ్యాన్స్  తో పాటు మూవీ లవర్స్ నోటి వెంట మోత మోగుతూ ఉండేది. కానీ ఇప్పుడు NBK 111 లో మాత్రం దర్శకుడు గోపిచంద్ మలినేని బాలయ్యని సైలెంట్ గా ఎలివేషన్ ఇచ్చాడు.  బహుశా డైలాగ్స్ లేకుండా బాలయ్య నుంచి వచ్చిన మొదటి మూవీ ప్రమోషన్ NBK 111 అవ్వచ్చు. 

 Also read: NBK 111  గ్లింప్స్‌ రిలీజ్.. స్పెషల్ ఇదే 


 
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com