Home

»

Latest News

Anil ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ.. కీలక అప్ డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

Jun 10, 2026 5:46PM

 

 


అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల 'మన శంకర వరప్రసాద్‌గారు'తో భారీ విజయాన్ని అందుకొని పరాజయాలకి చాలా లాంగ్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీని విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో చేస్తున్నాడు. ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా అధికారిక ఓపెనింగ్ వేడుకకి  సంబంధించిన ముహూర్తం ఖరారైందని స్వయంగా దర్శకుడే ఒక ప్రత్యేక ఈవెంట్‌లో వెల్లడించడంతో నందమూరి, దగ్గుబాటి అభిమానుల్లో ఆనందం అంబరాన్నంటుతోంది.

దశాబ్దాల కాలం తర్వాత ఒకే స్క్రీన్‌పై దగ్గుబాటి హీరో, నందమూరి హీరో కనిపించనుండటంతో టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి రీసెంట్ గా ఒక ఈవెంట్ లో మాట్లాడుతు ఈనెల 22  నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 18 న మూవీ ఓపినింగ్ అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం కూడా రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలోకి రానున్నట్టుగా తెలుస్తుంది. అనీల్ రావిపూడి గత చిత్రాలైన 'సరిలేరు నీకెవ్వరు', 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం' 'మన శంకర వరప్రసాద్‌గారు' వరుసగా సంక్రాంతికి వచ్చి  బాక్సాఫీస్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే.

also read: Peddi: పెద్దిక్రేజ్.. దొంగ నోట్ల కలకలం

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com