సినిమా తారలకు అభిమానులు ఉండడం సహజం. అందులోనే కొందరు వీరాభిమానులు కూడా ఉంటారు. తమ అభిమాన నటీనటుల కోసం అప్ప్పుడప్ప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఈ విషయంలో ముఖ్యంగా హీరోయిన్లు కొంత అసౌకర్యానికి గురవుతుంటారు.
ఇటీవలికాలంలో ఎంత పెద్ద స్టార్స్ అయినా అభిమానుýను కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. వారితో ఇంటరాక్ట్ కూడా అవుతున్నారు. ఒక్కోసారి శ్రుతి మించిన అభిమానం వల్ల స్టార్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో కూడా కొన్ని అనూహ్య సంఘటనలు జరగడం, హీరోయిన్లు షాక్‌కి గురవడం జరిగింది.
తాజాగా మలయాళ హీరోయిన్ మంజు వారియర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పేరు తెచ్చుకున్న పాలక్కాడ్‌లో ఒక జ్యూయలరీ షాప్ ఓపెనింగ్‌కి హాజరయ్యారు మంజు వారియర్. ఆమె అక్కడికి వస్తున్నారన్న సమాచారంతో లెక్కకు మించిన అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని అదుపు చేస్తున్న క్రమంలోనే ఒక లేడీ అభిమాని మంజును హగ్ చేసుకొని లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. వెంటనే ఆమెను అక్కడి నుంచి పంపించేశారు సెక్యూరిటీ సిబ్బంది.
ఈ హఠాత్ సంఘటనతో మంజు వారియర్ షాక్ అయినప్పటికీ కాసేపటికి తేరుకొని ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించారు. ఇటీవల మరో హీరోయిన్ హనీ రోజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక అభిమాని ఆమె నడుము మీద చెయ్యి వేసే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని, అది ఆరోగ్యకరం కాదని అంటున్నారు. సెలబ్రిటీలకు ఇలాంటి సందర్భాల్లో భద్రత కరువైందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
?s=20






