
-దర్శకుడిగా అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ తెలిసిందే
-మరి సిల్వర్ స్క్రీన్ పైకి హీరోగా వస్తే
-హీరోయిన్ గా ఎవరు బాగుంటారు
కొన్ని సినిమాల న్యూస్ కి సమ్మర్ ని సైతం కూల్ గా మార్చే శక్తి ఉంటుంది. అలాంటి ఒక న్యూస్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి సంబంధించిన నయా అప్ డేట్. నిన్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. సదరు ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతు అనిల్ రావిపూడిని నటుడుగా నేనే చేస్తానంటూ చెప్పాడు. మరి ఆ మాటని మంచి శుభముహూర్తం చూసి అన్నాడో ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే దిల్ రాజు అలా అన్నాడో లేదో అనిల్ రావిపూడి అభిమానులు, మూవీ లవర్స్ లో కూడా సహజంగా ఉండే సోమవారం డల్ నెస్ ని పోగొట్టి అసలైన పనిని కల్పించింది. మరి పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
దిల్ రాజు అనిల్ రావిపూడిని నటుడుగా నేనే చేస్తానని అనగానే ఫ్యాన్స్, మూవీ లవర్స్ రంగంలోకి దిగి అనిల్ రావిపూడి ఒక వేళ హీరోగా చేస్తే ఏ హీరోయిన్ అయితే బాగుంటుందని తమ సినీ మెదళ్ళకి పని కల్పిస్తున్నారు. కొంత మందైతే సదరు హీరోయిన్ల పేర్లని కూడా సోషల్ మీడియా వేదికగా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికైతే అనిల్ రావిపూడికి స్క్రీన్ పై యాక్టర్ గా కనపడటం ఇష్టపడలేదు. బట్ భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు(Dil Raju)మాట్లాడిన ఈవెంట్ లోనే అనిల్ కూడా మాట్లాడుతు ఇప్పట్లో చేయనని మాత్రమే చెప్పాడు. అంటే భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయి.
also read; VIjay antony: వంద దేవుళ్ళు.. ఆసక్తికరంగా మారిన వ్యాఖ్యలు
దిల్ రాజు, అనిల్ రావిపూడి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకం. అనిల్ ఇప్పటి వరకు తొమ్మిది చిత్రాలకి దర్శకత్వం వహిస్తే అందులో ఆరు చిత్రాలు దిల్ రాజు నిర్మించినవే. మరి అంతటి అనుబంధం నెలకొని ఉన్న నేపథ్యంలో అనిల్ ని దిల్ రాజు హీరోగా పరిచయం చేస్తే అంతకంటే క్రేజ్ కా కబాబ్ న్యూస్ మరొకటి ఉండదు. అనిల్ ప్రెజెంట్ వెంకటేష్(Venkatesh),కళ్యాణ్ రామ్(kalyan Ram)తో మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు. నెక్స్ట్ సంక్రాంతికే వచ్చే అవకాశాలు ఉన్నాయి.




