Home

»

Latest News

Dhurandhar 2 vs toxic: తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టేది ఎవరు!

Feb 24, 2026

 

-మార్చి 19 న సిల్వర్ స్క్రీన్ పైకి లాండింగ్ 
-ధురంధర్ 2 vs టాక్సిక్ 
-పోటీ తప్పదా
-సోషల్ మీడియా తాజా టాక్ ఏంటి

బాక్స్ ఆఫీస్ వద్ద అసలు సిసలైన సినీ మజాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు వేదికగా నిలిచిన ధురంధర్ 2 , టాక్సిక్ శరవేగంగా  ముస్తాబవుతున్నాయి. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఆ రెండు చిత్రాలపై ఆసక్తి నెలకొని ఉంది. ఆసక్తి నెలకొని ఉందని మనం చెప్తుంటే భలే విషయాన్నీ కనిపెట్టావు బాబు సన్మానం ఏమైనా చేయమంటావా అని ఈ న్యూస్ చదువుతున్న వాళ్ళు   అడుగుతారు.  గొప్ప అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఆ రెండు చిత్రాల కోసం ఎప్పట్నుంచో ఎంతో ఆశతో ఎదురుచూస్తు వస్తున్నారు.ఆ రెండు చిత్రాలపై  అంత క్యాపబిలిటీ  ఉంది.మనమేదో కొత్త విషయం కనిపెట్టామని  ఎగతాళిగా సన్మానం అని అంటున్నారు.మరి ధురంధర్ 2 , టాక్సిక్ కి సంబంధించిన కొత్త న్యూస్ ఏంటో చూద్దాం.


ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2),టాక్సిక్(Toxic)మార్చి 19 న ఒకే రోజు పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగుపెడుతున్నాయి. ధురంధర్ హిందీ ఒరిజినల్ కాబట్టి హిందీలో ఎక్కువ క్రేజ్, టాక్సిక్ కన్నడ మూవీ కాబట్టి కన్నడలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఓన్ భాష సినీ ప్రేమికులు  తమ సినిమానే ఎక్కువగా ఆదరిస్తారని అనుకునే జమానా రోజులు పోయి చాలా కాలం అవుతుంది. ఒక మాదిరిగా ఉన్న చిత్రాల కంటెంట్ బాగుంటేనే పాన్ ఇండియా ప్రేక్షకులు తమ నెత్తిన పెట్టుకోని ప్రమోషన్స్ చేస్తున్న రోజులు. అలాంటిది ధురంధర్ పార్ట్ 2 , టాక్సిక్ లాంటి బడా హీరోల సినిమాలకి ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఈ  నేపథ్యంలో ఈ రెండు ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబడతాయో అనే ఆసక్తి అందరిలో ఉంది. 

also read: ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య


సినీ సమాజంలో అభిమానులు సహజం కాబట్టి ఆ రెండు చిత్రాల్లో తమ అభిమాన చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాల వారిలా ఏరియా లెక్కలు వేసి మరి  చెప్తున్నారు. మరి తెలుగు అభిమానులు అందరి కంటే ముందుంటారు కాబట్టి వాళ్ళు కూడా తమకి ఇష్టమైన సినిమా తెలుగు నాట ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందనే కామెంట్స్ తో సోషల్ మీడియాని బాగానే యూజ్ చేస్తున్నారు. కాని ఎవరు కూడా రెండు సినిమాల్లో ఒక సినిమా వల్ల  ఇంకో సినిమా ప్లాప్ అవుతుందని చెప్పటం లేదు. దీంతో  సినీ రంగం బాగుండాలనే వాళ్ళ సినీ మానవత్వం అర్ధమవుతుంది. ధురంధర్ 2 , టాక్సిక్ లని చూడాలంటే పెట్టి పుట్టాలనే  సామెత కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదే ధురంధర్ 2 , టాక్సిక్ ల తాజా న్యూస్.    

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com