Home

»

Latest News

బాలయ్య vs మంచు మనోజ్: క్లైమాక్స్‌కు వచ్చేసిన ‘దాదా’.!

Oct 29, 2026 7:13PM

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘దాదా’. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 80ల నాటి ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మధ్యలో బాలయ్య గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయన కోలుకుని తిరిగి సెట్స్‌లోకి రావడంతో సినిమా పనులు వేగం పుంజుకున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ‘దాదా’ క్లైమాక్స్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు టాక్.

‘దాదా’లో బాలకృష్ణ లుక్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. రెట్రో గెటప్‌లో, గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో ఆయన కనిపించనున్నారు. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలపై అంచనాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘వారణాసి’ వాయిదా పడుతుందా?.. క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్.!

 

 

 

[Dada Movie Climax Shoot, Balakrishna vs Manchu Manoj, Dada Movie, Nandamuri Balakrishna, Gopichand Malineni, Manchu Manoj, Kajal Aggarwal, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com