Home

»

Latest News

Jetlee: మైత్రి వర్సస్  ఎగ్జిబిటర్లు..  జెట్లీకి అన్యాయం 

May 01, 2026

 

మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers).. అగ్ర నిర్మాణ సంస్థగా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బ్రాండ్ ని సంపాదించుకుంది. నిర్మాణ రంగంలోనే కాకుండాపంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన  వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వివాదం ఈ రోజు మైత్రి సమర్పణలో తెరకెక్కిన  'జెట్లీ' పంపిణీ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది.

దిల్ రాజు, ఏషియన్, సురేష్, గీతా డిస్ట్రిబ్యూటర్స్ ఆధీనంలోని సింగిల్ థియేటర్స్ మరియు మల్టీప్లెక్స్‌లలో (AMB, AAA)లో జెట్లీ  ప్రదర్శించబడలేదు. ఈ విషయంపై మైత్రి భాగస్వామి కేతిరెడ్డి శశిధర్ స్పందిస్తు సింగిల్ స్క్రీన్ కి మాకు మధ్య సమస్యలు ఉన్న మాట నిజమే. కానీ మల్టిప్లెక్స్ రిలీజ్ విషయంలో మాకు ఎలాంటి గొడవలు లేవు. కానీ కొన్నిమల్టిప్లెక్స్ లలో జెట్లీ  రిలీజ్ చెయ్యలేదని ఒక నోట్ రిలీజ్ చేసాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిలిం చాంబర్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

సాధారణంగా ఒక సినిమా విడుదలైనప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఒప్పందాలు జరుగుతుంటాయి. కానీ 'జెట్లీ'కి సంబంధించి మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థకు, కొంతమంది థియేటర్ల యజమానులకి మధ్య విబేధాలు వచ్చాయి. ఎగ్జిబిటర్ల వాదన ప్రకారం, సినిమా ప్రదర్శన సమయంలో తాము చెల్లించిన అడ్వాన్సులు లేదా సెటిల్‌మెంట్ నిధుల విషయంలో మైత్రీ సంస్థ నుంచి సరైన స్పందన రావడం లేదు. దీనివల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పంపిణీ సంస్థ నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని మైత్రీ వర్గాలు అంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంది.

Also read: Peddi: పెద్ది రిలీజ్ డేట్ వచ్చేసింది..  జూన్ 24 కంటే ఇంకా ముందే 

 తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేస్తుండగా  గిల్డ్ నిర్మాతలు రెంటల్ సిస్టమ్‌లోనే రిలీజ్ కావాలని పట్టుబడుతున్నారు. ఏదైనా వివాదం తలెత్తినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సినిమా పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది. 'జెట్ లీ' సినిమా విషయంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్లు ఒకే తాటిపైకి వచ్చి, ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా ముగించుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com