Home

»

Latest News

90 s డైరెక్టర్ ఆదిత్య హాసన్ కామెంట్స్ వైరల్.. మహుబూబ్ నగర్ అంటే క్యాబ్ డ్రైవర్లునా!

Mar 09, 2026

 

 
-గద్దర్ అవార్డ్స్ లో ఈటీవీ విన్ ప్రభంజనం
-ఆదిత్య హాసన్ ఉద్దేశ్యం ఏంటి!
-సోషల్ మీడియా వేదికగా ఏం చెప్తున్నారు


గద్దర్ అవార్డ్స్(Gaddar Awards).. సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళకి  తెలంగాణ (Telanagana)ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సినీ అవార్డ్స్ . రీసెంట్ గా 2025 వ సంవత్సరానికి సంబంధించిన  అవార్డ్స్ ప్రకటించగా అందులో ఈటీవీ విన్ నుంచి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి, అనగనగ, లిటిల్ హార్ట్స్ చిత్రాలతో పాటు మౌనమే నీ బాషా అనే షార్ట్ ఫిలిం గద్దర్ అవార్డ్స్ కి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా గద్దర్ అవార్డ్స్ అందుకున్న విజేతలతో ఈటీవీ విన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉండగా అందులో ప్రముఖ దర్శకుడు, లిటిల్ హార్ట్స్ నిర్మాత ఆదిత్య హాసన్ (Aditya Haasan)మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి. ఏం మాట్లాడాడో చూద్దాం.

ఆదిత్య  హాసన్ మాట్లాడుతు మాది తెలంగాణలోని మహబూబ్ నగర్ దగ్గర ఉన్న వనపర్తి(wanaparthy).ఎక్కడ ఉందో కూడా ఎవరకి సరిగా తెలియదు. పైగా మహబూబ్ నగర్ అంటే క్యాబ్ డ్రైవర్స్ అనుకునే వాళ్ళు. ఇప్పడు అందరం సిఏం మా జిల్లానే  అని గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలంగాణ కల్చరర్ కి ఈ అవార్డ్స్ నిదర్శనం అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలపై పలు సినీ ప్రియులు స్పందిస్తూ నువ్వు కూడా మహబూబ్ నగర్, వనపర్తి కి గర్వ కారణమనే కామెంట్స్ చేస్తున్నారు.

also read: అప్పుకి బదులు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయ్.. కూతురి నిర్ణయం ఏంటి!

ఆదిత్య హాసన్ ది వనపర్తి నే. ఈటీవీ విన్ నుంచి వచ్చిన 90  s  మిడిల్ క్లాస్ బయోపిక్  తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ తో నిర్మాతగాను సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నాడు.



  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com