
- సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా రష్మి ట్వీట్
- రష్మిని టార్గెట్ చేసిన ఖమేనీ మద్దతుదారులు
- క్యారెక్టర్ లెస్ అంటూ చీప్ కామెంట్స్
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కొద్దిరోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమవ్వడం సంచలనంగా మారింది. అయితే ఖమేనీ చనిపోతే మన భారతదేశంలోనూ కొందరు ఆందోళన చేశారు. సోషల్ మీడియాలో ఖమేనీకి మద్దతుగా పోస్ట్ లు పెట్టారు. అలాంటి వారిని ప్రముఖ యాంకర్ రష్మి తప్పుపట్టింది. (Anchor Rashmi Gautam)
ఖమేనీ చనిపోతే ఇక్కడ ఆందోళన చేయడం ఏంటంటూ రష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ఇరాన్ కి పంపించాలని ట్వీట్ చేసింది. అప్పటినుంచి ఖమేనీ మద్దతుదారులకు రష్మి టార్గెట్ అయింది. ఆమెపై బెదిరింపులకు దిగుతున్నారు. చెప్పడానికి వీల్లేని అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. వాటన్నింటికీ తనదైన శైలిలో రిప్లై ఇస్తుంది రష్మి.
కొందరైతే ఖమేనీ పేరుతో ఉన్న అకౌంట్స్ నుంచి రష్మి పోస్ట్ ల కింద దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. వాటిని స్క్రీన్ షాట్ తీసి రష్మి ట్విట్టర్ లో షేర్ చేయగా.. దానికి ఒక నెటిజెన్ నుంచి ఇంకో దారుణమైన రిప్లై వచ్చింది. ఆమెకు క్యారెక్టర్ లేదని, ఎందరితోనే రిలేషన్స్ పెట్టుకుందని ఆ కామెంట్ లో ఉంది.
తన క్యారెక్టర్ గురించి మాట్లాడిన నెటిజెన్ కి రష్మి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. "ప్రూఫ్ ఉంటే చూపించు. నాకు రిలేషన్ షిప్స్ ఉన్నా లేకపోయినా.. నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్నో, నీ తండ్రినో లేదా నీ కొడుకునో వివాహం చేసుకునే వరకు.. నేను ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదు. కేవలం నా పేరే ఎందుకు? నాకు ఎవరితో లింక్ ఉందో వాళ్ళ పేర్లు ప్రూఫ్ తో సహా చెప్పండి. మీరు ఎవరి క్యారెక్టర్ మీదైనా నింద వేయాలనుకుంటే.. ఇద్దరి పేర్లు బయటపెట్టడం న్యాయం." అని రాసుకొచ్చింది.
రష్మీ ఇచ్చిన సమాధానానికి సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. ఒక మహిళను టార్గెట్ చేస్తూ దారుణ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.







