Home

»

Latest News

Chiranjeevi: జననాయగన్ కోసం రంగంలోకి చిరంజీవి.. విజయ్ ఫ్యాన్స్ హ్యాపీ 

Apr 10, 2026

 


-నెట్టింట దర్శనమిస్తున్న జననాయగన్ పైరసీ 
-యావత్తు ఇండియన్ పరిశ్రమ షాక్ 
-ట్వీట్ చేసిన మెగాస్టార్ 
-ఆ డీటెయిల్స్ చూద్దాం.


పైరసీ.. అణుబాంబు కంటే ప్రమాదకరమైన పైరసీ పదం వింటే చాలు భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపాటుకి గురవుతుంది.స్క్రీన్ పైనే కాకుండా బయట కూడా జనరల్ గా హీరోలు దైర్యంగానే ఉంటారు. కానీ పైరసీ విషయంలో మాత్రం డల్ అయిపోతారు. అంతలా ఆ పెనుభూతం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్ జననాయగన్ మూవీ పైరసీ బారిన పడి నెట్టింట దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బాధపడని హీరో అండ్ టెక్నీషయన్  లేడు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ఈ విషయంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది.

 సదరు ట్వీట్ లో 'జననాయగన్(Jananayagan)లీక్ అవ్వడం నన్ను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా అనేది నమ్మకం, కృషి, మరియు ఎందరో సమిష్టి కలల మీద నిర్మించబడుతుంది. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. సృజనాత్మకతతో కూడిన పనిని కాపాడుకోవడం ఎంత కీలకమో కూడా ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. పైరసీని అంతమొందించే విషయంలో నా ఆలోచనలు  మద్దతు చిత్ర బృందానికి ఎల్లప్పుడూ ఉంటాయి. సినిమాను గౌరవించి, కాపాడే బాధ్యతను మనమందరం తీసుకుందాం. పైరసీని అంతం చేయండి. సినిమాని కాపాడండని తెలిపాడు.


Also read: Allu sneha reddy: వైరల్ గా మారిన అల్లు స్నేహరెడ్డి ఆస్తులు.. నిజమేనా! 

చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు, మూవీ లవర్స్ స్పందిస్తు పైరసీ విషయంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు. జన నాయగన్ ని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిందనేది టాక్. ఇప్పటికే సెన్సార్ విషయంలో వాయిదా పడింది. అలాంటి ఈ టైంలో పైరసీ బారిన పడటం నిజంగా దురదృష్టం. చిరంజీవి, బాబీ మూవీని కె వి ఎన్ ప్రొడక్షన్స్ నే నిర్మిస్తుంది. ఇక 'జననాయగన్' విషయంలో ట్వీట్ చేసినందుకు విజయ్(Vijay)ఫ్యాన్స్ చిరుకి థాంక్స్ చెప్తున్నారు.

 

   ?s=20


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com