
-ఈ నెల 8 న బర్త్ డే వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్
-ట్రెండ్ అవుతున్న అల్లు స్నేహ రెడ్డి ఆస్తులు
-మరి అవి నిజమేనా!
కొన్నిపేర్లకి పరిచయ వ్యాఖ్యానాలు అవసరం ఉండదు. అలాంటి వాళ్ళల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)వైఫ్ స్నేహరెడ్డి ఒకరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటంతో నిత్యం ఆమె పేరు ఏదో ఒక రూపాన ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ తన ఆస్తుల లిస్ట్ గురించిన న్యూస్ ట్రెండ్ అవుతూ ఉంది. మరి ఆ డీటెయిల్స్ చూద్దాం.
స్నేహా రెడ్డి(Allu Sneha Reddy)ఆస్తి విలువ సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుందనే న్యూస్ ఈ రోజే తనకి స్వాతంత్య్రం వచ్చినట్టుగా కనపడిన ప్రతి వాళ్ళకి హాయ్ చెప్తుంది. పైగా ఆ ప్రాపర్టీని తనే సొంతంగా సంపాదించిందనేది కూడా టాక్. అమెరికాలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసుకొని వచ్చిన స్నేహ రెడ్డి స్టైలిష్ ఫ్యాషన్ నుంచి ట్రావెల్ డైరీల వరకు, తన లైఫ్‌కి సంబంధించిన విషయాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మొదట తన తండ్రికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేసి ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఒక స్టూడియోని కూడా నడుపుతున్నారు. పలు బ్రాండ్లతో కలిసి వర్క్ చేస్తు నెలకి లక్షల్లో సంపాదిస్తుంది.
Also read: Dacoit: డెకాయిట్ హైలెట్స్ ఇవే.. టాక్ ఎలా ఉంది
స్నేహరెడ్డిది తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని చింతపల్లి విలేజ్. రీసెంట్ గా బర్త్ డే జరుపుకున్న అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలని తనే దగ్గర్నుండి నిర్వహించింది.పిల్లలు అయాన్, అర్హ ల గురించి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రెజెంట్ రాకా(Raaka)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే





