
-ధురంధర్ 1 విజయంలో రెహ్మాన్ పాత్ర తెలిసిందే
-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన డీటెయిల్స్
-మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం
రెహ్మాన్ డెకాయిత్ గా కంటి చూపు దగ్గరనుంచి కాలి గోటి వరకు మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ తో పాకిస్థాన్ లోని 'లాయిరీ' ఏరియాకి చెందిన నిజమైన అసాంఘిక శక్తి రెహ్మాన్ డెకాయిత్ ని మన కళ్ళ ముందు ఉంచాడు అక్షయ్ ఖన్నా(Akshaye Khanna). ధురంధర్ పార్ట్ 1 ఘన విజయంలో సైతం కీలక భూమిక. అసలు స్క్రీన్ పై తన క్యారక్టర్ ఎంట్రీ అవ్వడం ఆలస్యం ప్రేక్షకుల నుంచి ఈలలు కేకలు. రీసెంట్ గా అక్షయ్ ఖన్నా ఫుడ్ హ్యాబిట్స్ తో స్లీపింగ్ టైం గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
అక్షయ్ ఖన్నా ఉదయం టిఫిన్ చెయ్యడు. అవసరమైతే టీ తాగి డైరెక్ట్ గా మధ్యాహ్నం భోజనం చేస్తాడు. ఎక్కువగా ఇంటి భోజనాన్నే ఇష్టపడే అక్షయ్ మెనులో ఎక్కువ శాతం పప్పు, కొన్ని రకాల కూరగాయలు, చేపలు, చికెన్ ఉంటాయి. ఇంట్లో ఉన్నా సెట్స్ లో ఉన్నా అదే పరిస్థితి. ఒక్కో సారి నైట్ సమయంలో రైస్ తీసుకోవడం కుదరనపుడు చపాతీ తింటాడు. బెండకాయ, లిచీ పండ్లు, కేక్స్ అంటే చాలా ఇష్టం. డైలీ పది గంటలు నిద్ర మాత్రం తప్పని సరి. అలసిన శరీరానికి, మనసుకి ఊరటనిచ్చేది నిద్ర అనే బలమైన నమ్మకంతో ఉంటాడు.
Also read: Dhurandhar 2: ధురంధర్ 2 ని దెబ్బ కొట్టిన చిన్న మూవీ.. 52 దేశాలలో ట్రెండింగ్ అంటే మాటలా
ఈ విషయాలన్నీ గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అక్షయ్ ఖన్నానే వెల్లడి చేసాడు. రెహ్మాన్ డెకాయిత్ కాబట్టి మళ్ళీ తాజాగా వైరల్ గా మారాయి. చావా మూవీలో కూడా ఔరంగ జేబుగా వీరవిహారం చేసిన అక్షయ్ కి గతంలో హీరోగా చేసిన సినిమాల కంటే ఇప్పుడు ప్రతి నాయకుడిగా ఎక్కువ పేరు వస్తుండటం విశేషం. ఎంతలా అంటే తన అప్ కమింగ్ సినిమాల గురించి డైలీ సెర్చ్ చేసేంతలా. ఒకప్పటి బాలీవుడ్ అగ్ర హీరో వినోద్ ఖన్నా కొడుకే అక్షయ్ ఖన్నా.




