Home

»

Latest News

2027 సంక్రాంతి టార్గెట్.. ఆగిపోయిన క్రేజీ కాంబో మూవీ!

Apr 17, 2026

2027 సంక్రాంతి సీజన్ పై పలువురు హీరోలు కన్నేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ జనరేషన్ యంగ్ స్టార్స్ లో సంక్రాంతి హీరోగా పేరొందిన శర్వానంద్ (Sharwanand) సైతం.. 2027 సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అయితే అనూహ్యంగా శర్వా ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

శర్వానంద్, శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్‌లో ప్రకటించిన సినిమా పట్టాలెక్కడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. 2027 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకున్న ఈ ప్రాజెక్ట్, తాజా సమాచారం ప్రకారం బడ్జెట్ కారణాల వల్ల సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. 

బడ్జెట్ భారమే కారణమా?
శర్వానంద్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇక శ్రీను వైట్ల దర్శకుడిగా ఎన్నో మెమొరబుల్ కామెడీ సినిమాలు అందించారు. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లకముందే బడ్జెట్ లెక్కలు నిర్మాతలకి తలనొప్పిగా మారాయని వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీను వైట్ల సినిమాలంటేనే భారీ తారాగణం, విదేశీ లోకేషన్లు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. ప్రస్తుత కథ ప్రకారం బడ్జెట్ పరిమితి దాటిపోతుండటంతో, మార్కెట్ లెక్కల దృష్ట్యా అంత రిస్క్ అవసరమా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

సంక్రాంతి 2027 టార్గెట్.. కానీ!
శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది. గతంలో ఆయన నటించిన 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి', తాజాగా 2026లో వచ్చిన 'నారి నారి నడుమ మురారి' సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి ఘనవిజయాలు సాధించాయి. అదే సెంటిమెంట్‌తో శ్రీను వైట్ల సినిమాను కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజా బడ్జెట్ సమస్యలు ఈ ప్లాన్‌ను మార్చేలా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేం. స్క్రిప్ట్‌లో మార్పులు చేసి లేదా బడ్జెట్‌ను తగ్గించి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించవచ్చు. శర్వానంద్-శ్రీను వైట్ల కలయికలో సినిమా వస్తే ఖచ్చితంగా వినోదాత్మకంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి నిర్మాతలు బడ్జెట్ సమస్యను పరిష్కరించి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com