
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్లాస్ సినిమాల దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి, ఈసారి ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక భారీ మాస్ యాక్షన్ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం.
దర్శకుడు హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో క్లాసిక్ టచ్, అందమైన ప్రేమకథలు ఉంటాయి. కానీ 'ఫౌజీ' విషయంలో ఆయన తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫిజిక్, ఆయన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. వెండితెరపై ఆయనను అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు హను భారీ మాస్ ఎలివేషన్లను డిజైన్ చేశారట. ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో హను ప్రజెంట్ చేస్తున్నారట. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ గతంలో వచ్చిన వార్ సినిమాల కంటే భిన్నంగా, అత్యంత వైల్డ్ గా ఉండబోతున్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కేవలం భారీ డైలాగులు మాత్రమే కాకుండా, ప్రభాస్ కటౌట్‌ను పూర్తిగా జస్టిఫై చేసేలా ప్రతి ఫ్రేమ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు ప్రభాస్ ఎన్నో రకాల యాక్షన్ పాత్రలు చేసినప్పటికీ.. ‘ఫౌజీ’లో ఆయన స్టైల్, మేకోవర్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సినిమాలో ఒక పర్టికులర్ కాస్ట్యూమ్‌లో ప్రభాస్ వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయట. ఆ కాస్ట్యూమ్‌లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతారని, ఆ సీన్స్ సినిమాకే మేజర్ ప్లస్ పాయింట్‌గా మారుతాయని చర్చించుకుంటున్నారు. ప్రభాస్ కటౌట్‌కు హను రాఘవపూడి విజన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ రావడం గ్యారెంటీ.





