Home

»

Latest News

Raaka: అల్లు అర్జున్ 'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా!

Apr 17, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి 'రాకా' (Raaka) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒకే ఒక్క పోస్టర్ తో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాకాలో షారుఖ్ ఖాన్ మెరుపులు?
అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో బాలీవుడ్ బాద్‌షా 'షారుఖ్ ఖాన్' గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో షారుఖ్‌- అట్లీ కాంబినేషన్ లో 'జవాన్' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే అట్లీ అడగ్గానే 'రాకా'లో గెస్ట్ రోల్ కి కింగ్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

జైలర్‌కు 'నో'.. రాకాకు 'యస్'?
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2'లో గెస్ట్ రోల్ కోసం షారుఖ్‌ను సంప్రదించగా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అల్లు అర్జున్ 'రాకా' కోసం మాత్రం ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై బన్నీ, షారుఖ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు పూనకాలే అని చెప్పాలి.

భారీ తారాగణం.. భారీ అంచనాలు
ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రల కోసం రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటిసారిగా అల్లు అర్జున్ ఒక సైన్స్ ఫిక్షన్ చేస్తుండటం, ఫస్ట్ లుక్ విభిన్నంగా ఉండటంతో 'రాకా'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com