Home

»

Latest News

అచ్చియ‌మ్మ‌ సీన్లపై బుచ్చిబాబు సంచలన నిర్ణయం.. ‘పెద్ది’ ఆడియ‌న్స్‌కి స‌ర్‌ప్రైజ్‌!

Jun 14, 2026 4:28PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ క్లీన్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నప్పటికీ, సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్‌పై కొంత చర్చ నడుస్తోంది. ఆమె పోషించిన అచ్చియ‌మ్మ‌ పాత్ర నిడివి తక్కువగా ఉందంటూ వస్తున్న కామెంట్స్‌పై తాజాగా చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సంచలన క్లారిటీ ఇచ్చారు.

సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో బుచ్చిబాబు ఈ విషయంపై ప్రత్యేకంగా స్పందించారు. కథ ప్రకారం జాన్వీ కపూర్ పాత్ర చాలా రఫ్‌గా, రెబలిష్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర రన్‌టైమ్ ఇష్యూస్ కారణంగా ఆమెకు సంబంధించిన రెండు మూడు కీలకమైన ఎమోషనల్ సీన్లను కట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సీన్స్ మిస్ అవ్వడం వల్లే ఆడియన్స్‌కు ఆమె పాత్ర ఎక్కడో అసంపూర్తిగా అనిపించిందని, ఈ విషయాన్ని తాము గమనించామని ఆయన ఒప్పుకున్నారు.

గతంలో ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చానో, ఈ చిత్రంలో అచ్చియ‌మ్మ‌ పాత్రను కూడా అంతే ఎమోషనల్‌గా డిజైన్ చేశానని బుచ్చిబాబు వివరించారు. తన ప్రేమికుడు బతికున్నాడో లేదో తెలియకపోయినా మెడలో తాళి కట్టుకునే అంతటి గాఢమైన ప్రేమ అచ్చెమ్మదని, ఆ సీన్స్ ఎడిటింగ్‌లో పోవడంతో క్యారెక్టర్‌ ఎలివేషన్ తగ్గిందన్నారు. అందుకే మెగా అభిమానుల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్తూ.. కట్ చేసిన ఆ జాన్వీ కపూర్ డిలీటెడ్ సీన్లను బుధవారం నుండి థియేటర్లలో తిరిగి యాడ్ చేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు.

ఈ అప్‌డేట్‌తో బుధవారం నుండి ‘పెద్ది’ థియేటర్లలో సరికొత్త జోష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ సీన్స్ యాడ్ అయ్యాక థియేటర్ కౌంట్ మరియు రిపీట్ ఆడియన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక తన తదుపరి ప్రాజెక్టులపై కూడా బుచ్చిబాబు ఈ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉప్పెన’, ‘పెద్ది’ చిత్రాల్లో సమాజానికి మంచి సందేశాలు ఇచ్చానని, అయితే తన నెక్స్ట్ మూవీలో ఎలాంటి మెసేజ్‌లు ఉండవని తేల్చి చెప్పారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తన తర్వాతి సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com