
భారతీయ సినిమా తన మనుగడ సాగిస్తున్నంత కాలం, అందం, సౌందర్యం అనే వర్డ్స్ సైతం మనుగడ సాగిస్తున్నంత కాలం శ్రీదేవి పేరు ఎప్పుడు ప్రధమ స్థానంలో ఉంటుంది. అయితే ఇప్పుడు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ECR) సమీపంలో ఉన్న అత్యంత ఖరీదైన శ్రీదేవి కుటుంబ ఆస్తిపై పెద్ద చట్టపరమైన వివాదం చెలరేగింది. దశాబ్దాల క్రితం జరిగిన ఒక స్థలం కొనుగోలు వ్యవహారం భారత అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టు తలపులను తట్టింది.
మొదట మద్రాసు హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ, బోనీ కపూర్ కుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితులు సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో ఈ ఆస్తి వ్యవహారం ఒక్కసారిగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్తిపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు 'యథాతథ స్థితి' (Status Quo) కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, వారి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లతో పాటు మరికొందరికి సుప్రీంకోర్టు ప్రత్యేక నోటీసులు జారీ చేసింది.కోర్టు ఈ సుదీర్ఘ వివాదాన్ని మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు కీలక సూచన చేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆస్తి తగాదాలో 1988 నాటి లావాదేవీలు ఎంతవరకు చెల్లుబాటవుతాయి, పిటిషనర్ల వాదనలో నిజమెంత అనే అంశాలు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో తేలాల్సి ఉంది. కోట్లాది రూపాయల విలువైన ఈ ప్రాపర్టీ వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, మధ్యవర్తిత్వం సఫలమవుతుందో లేదో అని సినీ వర్గాలు, అభిమానులు ఉత్కంఠగా గమనిస్తున్నారు.

Also Read: షాక్ ఇచ్చిన ఐబొమ్మ రవి: నాంపల్లి కోర్టులో 3 కోట్ల పిటిషన్: వాళ్ళకి రోల్ మోడల్!
అసలు ఈ వివాదం విషయంలోకి వెళ్తే 1988వ సంవత్సరంలో శ్రీదేవి కుటుంబం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ వద్ద సుమారు 2.7 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఒక భూమిని కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఇతర నివేదికల ప్రకారం ఇది 4.7 ఎకరాల మేర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్తికి సంబంధించి ఒక మహిళ మరియు ఆమె సోదరుడు తమకు కూడా ఇందులో వాటా ఉందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
[Sridevi, Chennai Property, Supreme Court , Boney Kapoor, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





