Home

»

Movie Reviews

ntg

సినిమా పేరు : తిమ్మరాజుపల్లి టీవీ

బ్యానర్ : క ప్రొడక్షన్స్

Rating : 2.5

విడుదలయిన తేది : Apr 16, 2026

మూవీ పేరు:  తిమ్మరాజుపల్లి టీవీ
న‌టీన‌టులు: సాయి తేజ్,వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి, చిట్టిబాబు, లతీష్ కీలపట్టు  తదితరులు  
సినిమాటోగ్ర‌ఫీ: అక్షయ్ రామ్ 
ఎడిటింగ్:
మ్యూజిక్: వంశీ కాంత్ రేఖన 
నిర్మాత‌లు: కిరణ్ అబ్బవరం, రహస్య 
బ్యానర్: క ప్రొడక్షన్స్ 
రచన,ఎడిటింగ్, దర్శకత్వం: మునిరాజు 
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 17 ,2026 

హీరోగా తన చరిష్మా కొనసాగిస్తూ వస్తున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'తిమ్మరాజుపల్లి టీవీ'(Thimmaraju Palli Tv). ప్రచార చిత్రాలు పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగించడంతో ప్రేక్షకుల చూపు తిమ్మరాజుపల్లిపై పడింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

సతీష్(సాయి తేజ్) లైఫ్ ని సరదాగా గడిపే మధ్య తరగతి యువకుడు. తన ఊరి గ్రామస్థులు మొత్తం టీవీలో సినిమా చూడాలనుకున్నప్పుడు తలా కొంత డబ్బులు వసూలు చేసి సతీష్ కి ఇస్తే, తను టౌన్ కి వెళ్లి టీవీ, సినిమా క్యాసెట్ లు అద్దెకి తీసుకొస్తుంటాడు. శారద( వేద జలంధర్), సతీష్ ప్రేమించుకుంటారు. రాజప్ప(ప్రదీప్ కొట్టే), ఎల్లమ్మ( స్వాతి కరిమిరెడ్డి) కొత్తగా పెళ్ళైన జంట. ఇద్దరు కల్లాకపటం లేని మంచి మనుషులు. రాజప్ప ఎవరో కాదు స్వయానా శారదకి అన్నయ్య. రాజప్ప ఇంట్లో ఉండే టీవీ దొంగతనానికి గురవుతుంది. దీంతో సతీష్, శారద పెళ్ళికి రాజప్ప ఒప్పుకోడు. టీవీ దొంగతనానికి సతీష్, శారద పెళ్ళికి సంబంధం ఏంటి? టీవీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి?  టీవీ వెనక ఏమైనా కథ ఉందా? ఉంటే ఆ కథ ఏంటి? సతీష్, శారద ఒక్కటయ్యారా? టీవీ దొంగతనం వల్ల ఎల్లమ్మ, రాజప్ప మధ్య ఏమైనా కలహాలు వచ్చాయా? అనేదే తిమ్మరాజుపల్లి టీవీ.

ఎనాలసిస్ :

ఇలాంటి కథతో మూవీ తెరకెక్కించడం మంచి ప్రయత్నమే.. కానీ సింగల్ పాయింట్ తో నడిచే సబ్జెట్ ని ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే తెరకెక్కించాలి. మన పాత వంశీ సినిమాలని చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. అలా కాకుండా టీవీ దొంతనం అనే సింగల్ పాయింట్ ని సీరియస్ గా తెరకెక్కించడమే కొంచం ఇబ్బందిగా ఉంటుంది. మూవీ మొత్తం కంప్లీట్ గా తిమ్మరాజుపల్లి అనే గ్రామంలోనే జరుగుతుంది కాబట్టి పల్లెటూరిలో ఉండే కామెడీ మనుషులని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది.

ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. విచిత్రం ఏంటంటే తన వాయిస్ ఓవర్ లో ఏదైతే చెప్పాడో ఆ కథ ఉండదు. సతీష్, శారద మధ్య వచ్చే లవ్స్ సీన్స్ నాచురల్ గా ఉన్నాయి. పాత రోజుల్లో చాలా మంది అమ్మాయిలు తనకి నచ్చిన హీరో సినిమా క్యాసెట్ ఇస్తే మరింత ప్రేమని చూపించే వారు. ఆ విధంగా ఆ ఇద్దరి మధ్య ప్రేమని చూపించిన విధానం బాగుంది. ఈ లైన్ మీదనే మరింత కథనాన్ని అల్లితే  కావాల్సినంత స్టఫ్ దొరికేది. రాజప్ప, అతని తండ్రి మధ్య వచ్చే సీన్స్, రాజప్ప పెళ్లి సీన్స్ బాగున్నాయి.  

మిగతా క్యారెక్టర్స్ మధ్య వచ్చిన సీన్స్ లో పసలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో సతీష్ తాను చేసిన ఛాలెంజ్ పైనే ఎక్కువ ఫోకస్ చెయ్యాల్సింది. అలా కాకుండా కథని నడపడానికి అనవసరమైన సీన్స్ చాలానే వచ్చాయి. రివర్స్ స్క్రీన్ ప్లే లో కూడా తెలిసిన కథనే మళ్ళీ ఎందుకు చెప్పారో అర్ధం కాదు. టివి దొంగతనం ఎవరు చేసారో కనుక్కునే ప్రాసెస్ లో వచ్చిన సీన్స్ మాత్రం  బాగున్నాయి. మేకర్స్ అదృష్టం ఏంటంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగుంది.

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు  

సతీష్ క్యారక్టర్ లో సాయి తేజ్ పెద్దగా సూటవ్వలేదు. పెర్ ఫార్మ్ పరంగా కూడా సోసో. రాజప్పగా ప్రదీప్ కొట్టే మాత్రం సూపర్ గా చేసాడు. మూవీ మొత్తానికి తన పెర్ఫార్మ్ నే హైలెట్. తెలుగు సినిమాకి ఒక కొత్త రకం రూపుతో కూడుకున్న నటుడు దొరికినట్టే.  శారద, ఎల్లమ్మలుగా చేసిన వేద జలంధర్, స్వాతి  తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు చేసి మెప్పించారు. మిగతా ఆర్టిస్టులు గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేకపోయినా ఊరిపెద్దగా చేసిన రామ చంద్ర మాత్రం పర్వాలేదనే స్థాయిలో చేసాడు. మూవీ మొత్తం ఒకే ఊరిలో తెరకెక్కించారు కాబట్టి కిరణ్ అబ్బవరం నిర్మాణ విలువుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించాయి. మునిరాజు(Muniraju)దర్శకుడిగా మెప్పించాడు కానీ రచయితగా మెప్పించలేకపోయాడు.

బలాలు
1 . పల్లెటూరి వాతావరణం 
 2 .ఫొటోగ్రఫీ 
3 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
4 .ప్రీ క్లైమాక్స్ 
5 . క్లైమాక్స్ 

బలహీనతలు 
1 . కథ 
2 . కథనం
3 . మాటలు 
4 . రాంగ్ కాస్టింగ్ 

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్ :

చివరిగా చెప్పాలంటే మంచి ప్రయత్నం.. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.  

g-news-banner

INTERESTING NEWS

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com