
Jayam serial : రుద్ర హెచ్చరికతో వీరు షాక్.. పెద్దసారు ఎమోషనల్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -234 లో... పెద్దసారుతో రుద్ర మాట్లాడతాడు. ప్రమాదం ఉందని నువ్వు ముందే ఊహించావ్ కదా.. నిన్ను నేను గమనించాను.. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని పెద్దసారు అనగానే ఇదంతా బిజినెస్ పరంగా చేస్తున్నారని రుద్ర అంటాడు. నాకు తెలుసు రుద్ర నువ్వు ఈ కుటుంబానికి ఏం కాకుండా కాపాడుతావు కానీ నీకు ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేని అని పెద్దసారు ఎమోషనల్ అవుతాడు. అదంతా వీరు వింటాడు. రుద్ర వచ్చి ఏంటి వీరు ఇక్కడున్నావని అడుగుతాడు. మావయ్యతో మాట్లాడుదామని అనుకున్నాను.. మీరు మాట్లాడుతున్నారు కదా అందుకే ఇక్కడే ఉన్నా అని వీరు అంటాడు. నువ్వు కూడా ఈ కుటుంబం కదా పర్సనల్ ఏముంటుందని రుద్ర అంటాడు. వీరు నువ్వు కూడా జాగ్రత్త ఎవరైనా దెబ్బలు బయటకు కన్పించకుండా కొడతారు. ఆ దెబ్బలు నువ్వు మళ్ళీ మాకు ఎవరికి చెప్పలేక బాధపాడుతావ్.. ఎందుకు ఈ కుటుంబంలో వ్యక్తివే కదా.. అందుకే నీపై కూడా ఎటాక్ జరగొచ్చని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఉదయం ఇక ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్ళదని వీరు అనుకుంటాడు. అప్పుడే ప్రమీల రెడీ అయి హడావిడిగా కిందకి వచ్చి గంగ బాక్స్ రెడీ చేసావా అని అడుగుతుంది. నువ్వు వెళ్ళావని అనుకున్న అక్క అని గంగ అనగానే అత్తయ్య ఏదో అన్నారని ఇంట్లో కూర్చుంటే ఎలా అని ప్రమీల అంటుంది. గుడ్ ప్రమీల ఇలానే ఉండాలని రుద్ర తనకి సపోర్ట్ చేస్తాడు. ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్తుంటే శకుంతల కోపంగా చూస్తుంది. వీరు డిస్సపాయింట్ అయ్యావా అని రుద్ర అంటాడు. ఆ తర్వాత పెద్దసారుని చూడడానికి లక్ష్మి, పైడిరాజు వస్తారు. చూసారా అత్తయ్య మీరు ఈ ఇంటికి రావద్దన్నా కూడావచ్చారని శకుంతలతో ఇషిక అంటుంది దాంతో వాళ్ళని శకుంతల అవమానించి పంపిస్తుంది. గంగ బాధపడుతుంది. తరువాయి భాగంలో గంగ పేరెంట్స్ ని మీరే కనుక్కోవాలి బాబు అని ఏం జరిగిందో అంత రుద్ర, రంగాకి లక్ష్మీ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026.webp)
Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్.. శ్రీవల్లిని బయటకు గెంటేసిన చందు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -436 లో..... శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న చందు తనని బ్యాగ్ తో సహా పుట్టింటి దగ్గర దింపేస్తాడు. అప్పుడే భాగ్యం, ఆనందరావు రెడీ అయి వస్తుంటే.. బ్యాగ్ తో వస్తున్న శ్రీవల్లి ని చూస్తారు. ఏంటి అమ్మడు మేమే వస్తున్నాం కదా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావ్.. దగ్గరుండి తీసుకొని వెళదామని వచ్చావా అని ఆనందరావు, భాగ్యం అంటుంటే శ్రీవల్లి జరిగింది చెప్తుంది. నా కాపురాన్ని కూల్చేశారని బోరున ఏడుస్తుంది. ఆ నర్మద ప్రేమ, నిన్ను భయపెట్టడానికి బ్లాక్ మెయిల్ చేశారనుకున్న గానీ ఇలా చేస్తారనుకోలేదని భాగ్యం అంటుంది. వాళ్ళేం చేశారు మనమే తప్పు మీద తప్పు చేసామని శ్రీవల్లి ఏడుస్తుంది. ఆ తర్వాత పూజలో కూర్చోవడానికి పెద్దోడు శ్రీవల్లిని తీసుకొని రమ్మని ప్రేమ, నర్మదలని వేదవతి పంపిస్తుంది. తీరా అక్కడికి వెళ్లేసరికి అక్కడ వాళ్లుండరు. అప్పుడే చందు వస్తాడు. శ్రీవల్లిని వాళ్ళ పుట్టింట్లో దింపేసి వచ్చాను వాళ్ళ అమ్మ కాలు జారి కిందపడిందని చందు చెప్తాడు.. చందు వెళ్లిపోతుంటే తన వెనకాలే ప్రేమ, నర్మద వెళ్లి ఏంటి బావ.. ఇది తన తప్పు చెప్పి మారుస్తారనుకున్నాం ఇలా చేశారని అంటారు. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకండి అని చెప్పేసి చందు వెళ్ళిపోతాడు. మరి పూజ మీద నర్మద,సాగర్ కూర్చోండి అని వేదవతి అంటుంది వాడు కూర్చుంటే నేను పూజలో కూర్చోనని రామరాజు అంటాడు. దాంతో సాగర్ కి కోపం వచ్చి పూజ దగ్గర నుండి లేస్తాడు. మరి ప్రేమ, ధీరజ్ మీరు కూర్చోండి అని వేదవతి అంటుంది. నేను దంతో కలిసి కూర్చోనని ధీరజ్ అంటాడు. అమూల్య విషయంలో ప్రేమ మోసం చేసింది.. నేను తన పక్కన కూర్చొని పూజ చెయ్యలేనని ధీరజ్ అంటాడు. దాంతో ధీరజ్ ని వేదవతి పక్కకి తీసుకొని వెళ్లి.. అసలు విషయాలు నీకు తెలియవు.. ఇప్పుడు చెప్పే పరిస్థితిలో నేను లేనని సర్ది చెప్పి పూజలో కూర్చునేలా వేదవతి చేస్తుంది. ఇద్దరు పూజ చేస్తారు. మరొకవైపు శ్రీవల్లి చేసిన మోసాన్ని చందు గుర్తుచేసుకొని బాధపడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026.webp)
Podharillu Serial: మాధవ పెళ్లి విషయంలో రచ్చ.. నారాయణ ఫ్యామిలీలో కొత్త గొడవలు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -85 లో......మాధవకి గాయత్రి నిజం చెప్పి పెళ్లి చెయ్యమని అడగడానికి తాంబులం పట్టుకొని మహా కేశవ, చక్రి, కన్నా వెళ్తారు. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మహాని తాయారు తిడుతుంది. దాంతో తనపై కర్ర ఎత్తుతాడు కేశవ. మా వదిన జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళందరూ తాయారు ఇంటికి వెళ్లిన విషయం మాధవకి తెలిసి పరుగున ఇంటికి బయల్దేరతాడు. ఆ తర్వాత మహా, కన్నా, కేశవ, చక్రి అందరు తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చాక నారాయణ వాళ్ళతో మాట్లాడతాడు. ఏమైంది తిట్టాలిసినవన్నీ తిట్టారా అని మహా, చక్రి, కేశవ,కన్నా వాళ్ళని నారాయణ అడుగుతాడు. నీ కంటే వాళ్ళ గురించి తెలియదు వీళ్ళకి అయినా తెలుసు కదా.. వాళ్ళకి వచ్చిన ఆస్తులు అమ్ముకొని నా వాటా కావాలని కోర్ట్ లో కేసు వేశారు.. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి పిల్లని ఇవ్వమని అడుగుతారా.. ఇంతకన్నా మూర్కులు ఎవరైనా ఉంటారా అని నారాయణ కోప్పడతాడు. అప్పుడే మాధవ వస్తాడు. అక్కడికి ఎందుకు వెళ్లారని అందరిపై కోప్పడతాడు మాధవ. నేను మీకు చెప్పానా నాకు ఇది కావాలని.. అసలు ఎవరు మీరంతా అని మాదవ కోప్పడతాడు. మేం ఎవరిని మమ్మల్ని చూస్తున్నావ్ అన్నయ్య అని చక్రి ఎమోషనల్ అవుతాడు. ఒరేయ్ నువ్వు చదువుకునేవాడివి ఎందుకురా నీకు ఇవన్నీ అని కన్నాపై మాధవ అరుస్తాడు. నావల్లే ఇదంతా బయట నుండి వచ్చిన దాన్ని బయటకి వెళ్ళేదాన్ని సైలెంట్ గా ఉండకుండా నేను తప్పు చేసానని మాధవకి మహా సారీ చెప్పి దిగాలుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాధవ దగ్గరికి మహా వచ్చి మాట్లాడుతుంది. కోపం తగ్గిందా అని అడుగుతుంది. ఎవరి మీద నాకు కోపం లేదు.. వాళ్ళు మంచి మనుషులు కాదు.. అనవసరంగా వాళ్ళతో మీకెందుకు గొడవ అని మాధవ అంటాడు. ఆ తర్వాత ఉదయం నారాయణకి తగిలిన దెబ్బకి కట్టు చేంజ్ చెయ్యాలని మహా వస్తుంది. వద్దని నారాయణ అంటాడు. దాంతో తన కొడుకులతో కట్టు చేంజ్ చేయించుకుంటాడు నారాయణ. అందరు నారాయణకి చెక్కిలిగింతలు చేస్తూ నవ్విస్తారు. ఆ తర్వాత కేశవ దగ్గరికి శైలు వచ్చి.. నా ఫోన్ ఇస్తే ఒక్క రీల్ చేసుకుంటాను ప్లీజ్.. ఫాలోవర్స్ హ్యాపీ నెస్ అని శైలు రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో కేశవ ఒప్పుకుంటాడు కానీ శైలు చేతికి కేశవ గొలుసు కడతాడు. ఇప్పుడు చెయ్ నీ రీల్స్ అంటూ ఫోన్ ఇస్తాడు కేశవ.. శైలు రీల్స్ చేస్తుంది. తరువాయి భాగంలో మాధవకి పెళ్లి సంబంధం చూడడానికి మాట్రిమోనీలో మాధవ డీటేల్స్ పెడుతుంది మహా. ఆ విషయం మాధవకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026
Karthika deepam2 : దీపను చంపాలని చూసిన జ్యోత్స్న.. చివరి నిమిషంలో కార్తీక్ ఎంట్రీతో సీన్ సితార్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2''(karthika deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -635 లో...... జ్యోత్స్నకి దీపే అసలైన వారసురాలు అన్న నిజం తెలిసిందని కార్తీక్ కి తెలుస్తుంది. దాంతో హడావిడిగా దాస్ దగ్గరికి వస్తాడు కార్తీక్. జ్యోత్స్న డిఎన్ఏ టెస్ట్ చేసింది.. దీప సాంపిల్స్ టెస్ట్ చేయించింది.. దీపనే అసలైన వారసురాలనే నిజం జ్యోత్స్నకి తెలిసిపోయింది.. ఇందాక పారు చేతిలో ఆ రిపోర్ట్స్ చూసానని కార్తీక్ అంటాడు. పారుకి ఇంగ్లీష్ రాదు కాబట్టి తనకి ఆ రిపోర్ట్స్ లో ఏముందో తెలియదు.. ఏంటని అడిగితే కవర్ చేసానని కార్తీక్ చెప్పగానే దాస్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు జ్యోత్స్న ఏం చేయబోతుంది. ఖచ్చితంగా దీపని చంపాలని ట్రై చేస్తుందని కార్తీక్ అంటాడు. ఇప్పుడు దీపని కాపాడాలని కార్తీక్ అంటాడు. దీప కోసం కార్తీక్ వెతుకుతాడు. దీప డాబా పైన చెట్లకి నీళ్లు పోస్తుంది. అక్కడికి జ్యోత్స్న వెళ్లి వెనకాల నుండి నెట్టెయ్యాలని ట్రై చేస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి దీప అని గట్టిగా అరుస్తాడు. దీప వెనకాలున్న జ్యోత్స్నని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలా హైట్ లో ఉంటే కళ్ళు తిరుగుతాయంట కదా పడిపోతే పట్టుకుందామని చూస్తున్నానని జ్యోత్స్న అంటుంది. ఏంటి బావ నేను ఏమైనా దీపని తోసేస్తాననుకున్నవా అని జ్యోత్స్న అంటుంది. దీప నువ్వు వెళ్ళు అని కార్తీక్ తనని కిందకి పంపిస్తడు. ఏంటి బావ ఏం చేస్తానని కంగారుపడుతున్నావా.. పదా అందరం విందు భోజనం చేద్దామని జ్యోత్స్న అంటుంటే అందులో ఏదో విషం కలిపి ఉంటుందని కార్తీక్ కి డౌట్ వస్తుంది. అందరు హాల్లో ఉంటారు. అందరం భోజనం చేద్దాం పదండి అన్ని వంటలు దగ్గరుండి సెలెక్ట్ చేసానని జ్యోత్స్న అంటుంది. తను అలా అంటుంటే కార్తీక్ అనుమానం ఇంకా బలపడుతుంది. అందరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక్కడ ముఖ్యమైన గెస్ట్ దీప కాబట్టి ముందు భోజనం దీప చెయ్యాలి. మొదటి ముద్ద నేను దీపకి తినిపిస్తానని జ్యోత్స్న అంటుంది. డౌట్ లేదు అందులో విషం కలిపిందని కార్తీక్ అనుకుంటాడు. అది స్పెషల్ కాదు మరదలా దీప చేత్తో నువ్వు తినడం స్పెషల్.. దీప నువ్వు జ్యోత్స్నకి భోజనం తినిపించమని కార్తీక్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడ్డట్టు యాక్టింగ్ చేస్తుంది. కానీ దీప చేత జ్యోత్స్న భోజనం తిని కార్తీక్, దాస్ కి షాక్ ఇస్తుంది. నా కూతురు అందులో ఏం కలపలేదు అల్లుడు.. మనల్ని ఫూల్స్ చేసింది. తన ప్లాన్ వేరే ఉందని కార్తీక్ తో దాస్ అంటాడు. ముందు అందరు తినండి.. ఆ తర్వాత ఇంకా వినోదకార్యక్రమాలు ఉన్నాయని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కేక్ కటింగ్ కి రెడీగా ఉంటుంది. సుమిత్ర గురించి గొప్పగా చెప్తుంది. నువ్వు పెళ్లి చేసుకోవడం కావాలని సుమిత్ర అనగానే సరే అమ్మ పెళ్లికొడుకు ఇక్కడే ఉన్నాడని కార్తీక్ వంక చూపిస్తుంది. అందరు షాక్ అవుతారు. అందేంటని దీప అనగానే పూర్తిగా వినండి మా బావలాగా ఉండాలని అంటున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ విషయం మీ నాన్నకి చెప్పమని కాంచన అంటుంది. అందరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026
Brahmamudi : దుగ్గిరాల వారసురాలిపై ఐశ్వర్య కన్ను.. ఆస్తి కోసం కొత్త కుట్ర!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -997 లో......రెండు రోజుల్లో ఇందు పుట్టినరోజు తను పెట్టె సంతకంతో దుగ్గిరాల ఆస్తులు మొత్తం రేఖకి వెళ్ళిపోతాయ్.. సంతకం పెట్టకని సుభాష్, అపర్ణ అంటుంటే సంతకం పెట్టకపోతే ఏం చేస్తుందోనని ఇందు టెన్షన్ పడుతుంది. కాసేపటికి ఇందు, స్వాతి మాట్లాడుకుంటారు. పక్కనే ఉన్న ఐశ్వర్య చూసి ఇప్పుడు దీన్ని రేఖ ఆంటీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. దీన్ని కిడ్నాప్ చేసి డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తే నా ఫ్రెండ్ అప్పు మొత్తం కట్టేయొచ్చని ఐశ్వర్య ప్లాన్ చేస్తుంది. అప్పుడే ఐశ్వర్యకి లక్కీ నుండి హాయ్ అని మెసేజ్ వస్తుంది. అది చూసి నా పని వీళ్లతోనే పూర్తి అవుతుందని అనుకుంటుంది. నిన్ను వెంటనే కలవాలి లాభం వచ్చే పని ఉందని ఐశ్చర్య చెప్తుంది. దానికి లక్కీ సరే అంటాడు. మరొకవైపు నందు బొకే షాప్ దగ్గరికి వెంకీ వస్తాడు. నా లవ్ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పారు కానీ చివరికి హ్యాండ్ ఇచ్చారని వెంకీ అంటాడు. నేను హెల్ప్ చెయ్యనని నందు అనగానే వెంకీ కోపంగా చేయకులే అని వెళ్తుంటాడు. తనని ఒక వెహికల్ డాష్ ఇచ్చి వెళ్తుంది. దాంతో అతను కిందపడిపోతాడు. వెంటనే నందు వచ్చి కట్టుకడుతుంది. నాకు హెల్ప్ చెయ్యనన్నావని వెంకీ అనగానే చేస్తానులే అని నందు చెప్తుంది. మరొకవైపు ఐశ్వర్య దగ్గరికి లక్కీ, రాజు వస్తారు. నిన్ను ఒక్కడినే రమ్మన్నాను కదా అని ఐశ్వర్య అనగానే.. ఏం చేసినా ఇద్దరం చేస్తామని లక్కీ చెప్తాడు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చెయ్యాలని ఐశ్వర్య అనగానే నీకు మేమ్ ఎలా కన్పిస్తున్నాం.. చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా చెయ్యమని తనపై రాజు సీరియస్ అవుతాడు. ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతో ఐశ్వర్య డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు రాజు వాళ్ళ ఇంటికి స్మగ్లర్ సాహో వస్తాడు. అంతకుముందే అతనికి సంబంధించిన మత్తుపదార్థాలు రాజు పాడు చేసిన విషయం తెలిసిందే.. దాంతో రాజుని పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు సాహో. ఇప్పుడు ఏకంగా రాజు ఫ్రెండ్ ని అంటూ రాజు ఇంటికి వచ్చి తన పేరెంట్స్ తో మాట్లాడుతాడు. ఆ తర్వాత రాజు ఇంటికి వస్తాడు. అతన్ని అక్కడ చూసి షాక్ అవుతాడు. అప్పుడే వెంకీ దెబ్బలతో ఇంటికి వస్తాడు. అది మన పనే అని రాజుతో సాహో అంటాడు. రాజులో టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026
నిహారిక నువ్వు నాకు నచ్చావ్ అంటున్న సుధీర్
ఆట లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎపిసోడ్ ఎంట్రీలోనే సుధీర్ నిహారికకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఒక కవిత రాసుకుని వచ్చాడు. "అంతుందేంటీ మ్యాటరు" అని నిహారిక అడిగేసరికి "నా గుండెల్లోంచి వచ్చిన పదాలన్నీ కలిపి రాసాను " అన్నాడు. "నిహారిక ఓ నిహారిక అడక్కుండానే ఆట ఇచ్చావ్, అడుగుదామనేలోపే బేటా ఇచ్చావ్. టాలెంట్ కి అద్భుతమైన వేదికనిచ్చావ్, దానికి జడ్జ్ గా రాధికనిచ్చావ్, షూట్ చేయడానికి కెమేరానిచ్చావ్, వెయిట్ చేయడానికి కారవనిచ్చావ్ , చెమట పడితే టచ్ఛప్ ఇచ్చావ్, చీకటి పడితే ప్యాకపిచ్చావ్" అని సుధీర్ చెప్పేసరికి "నాకెందుకు దేవుడా ఇదంతా వినడానికి చెవులిచ్చావ్ " అంటూ నిహారికా కౌంటర్ ఇచ్చింది. "నిహారికా దారి లేని వాళ్లకు కొత్త మార్నింగ్ ని ఇచ్చావ్, దారి తప్పుతున్న నాకు వార్నింగ్ ని ఇచ్చావ్ , అందుకే నువ్వు నాకు నచ్చావ్ నచ్చావ్ నచ్చావ్ " అంటూ సుధీర్ చాలా మంచి కవిత చెప్పాడు. "ఇది కవిత్వం కాదు కపిత్వం " అని చెప్పింది. ఇక తర్వాత ప్లేయర్స్ ఒక్కొక్కళ్ళు వచ్చి ఫన్నీ గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ నవ్వించారు. జడ్జ్ రాధ ఇరేజర్ , రఘు మాష్టర్ గరిటె , కావ్య బూజు దులుపుకుని కర్రలు, సమీరా భరద్వాజ్ జెండా కర్రలు, విష్ణు ప్రియా ఖాళి వైట్ పేపర్ తెచ్చి ఇచ్చింది.
Apr 03, 2026
రీతు చౌదరి ట్రోల్స్ రచ్చకు డెమోన్ పవన్ ఫుల్ స్టాప్
బుల్లితెర మీద సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన 9 కంటెస్టెంట్ రీతూ - డెమోన్ పవన్ బాగా ట్రోల్ అయ్యారు. వీళ్ళిద్దరూ ఏ షో కైనా ఎక్కడికైనా ఒకరు లేకుండా ఒకరు వెళ్లారు. అలాంటిది ఇప్పుడు డెమోన్ పవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఒక సుదీర్ఘ పోస్ట్ ని రీతూ గురించి పెట్టాడు. "రీతూ గురించి వెనక మాట్లాడే వాళ్ళ కోసమే ఇదంతా చెప్తున్నా...జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నాన్నను కోల్పోవడం చాలా పెద్ద విషయం. పాస్ట్ లో బ్రేకప్ అవ్వడం బాధాకరమైన విషయం. ఇన్ని జరిగిన ఆమె తన ఫామిలీ కోసం మళ్ళీ లేచి నిలబడింది. ఆమె ఎవరి మీద డిపెండ్ కాలేదు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ ఒకవేళ ఆమె మీకు నచ్చకపోతే వదిలేయండి కానీ ఆమె గురించిన నెగటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయకండి. చాలామంది ఆమె మీద రూమర్స్, నెగటివిటీ, బాడ్ కామెంట్స్ సిల్లీగా పాస్ చేసేస్తున్నారు. ఆమె ఏదైనా బెస్ట్ గా చేయాలనుకుంటుంది ఆమె ఎవరికీ చెడు చేయలేదు. ఆమె ఎన్ని కష్టాలు పడినా తన స్ట్రాంగ్ మైండ్ సెట్ తో అన్నింటికీ దూరంగా వచ్చి తన పని తానూ చేసుకుంటోంది. దేవుడి మీద భక్తితో తన మీద తానె గొప్ప నమ్మకంతో ఆమె చాల కష్టపడుతుంది తన ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడింది. ఆమె చాల స్ట్రాంగ్, మెచ్యూర్ గా ఉంటుంది, జెన్యూన్ గా కేరింగ్ గ చూసుకుంటుంది. మనసులో మాత్రం చిన్నపిల్లలా ఉంటుంది. నేను ఆమె దగ్గర నుంచి చాల విషయాలు నేర్చుకున్నా నేర్చుకుంటూనే ఉంటాను. నాకు ఆమె ఒక బిగ్ ఇన్స్పిరేషన్ " అంటూ చాలా ఘాటుగా ట్రోలర్స్ కోసం పెట్టాడు డెమోన్ పవన్.
Apr 03, 2026
Brahmamudi:రేఖ ప్లాన్‌కు చెక్ పెడుతున్న ఇందు.. చిక్కుల్లో ఐశ్వర్య!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -996 లో.....సుభాష్ కి ఇందు సూప్ తాగిస్తుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. ఆ రేఖ ఒక పాము.. తనని నమ్మకు రెండు కొత్త బట్టలు కొనిచ్చి, రెండు ముద్దలు తినపెడితే అది మారిపోయిందనుకోకని ఇందుతో అపర్ణ అంటుంది. నాకు తెలుసు త్వరలో నా పుట్టినరోజు ఉంది కదా.. అప్పుడు ఆస్తులు తన పేరున చేసుకోవాలని.. నా సంతకం కోసం ఇదంతా చేస్తుందని ఇందు అనగానే అంటే అంతా తెలిసి ఇలా ఉన్నావా.. నువ్వు మాత్రం సంతకం చెయ్యకని అపర్ణ అంటుంది. నాకు తెలియదా నేను సంతకం పెట్టడం కోసమే మిమ్మల్ని ఏం చెయ్యడం లేదని ఇందు అంటుంది. సంతకం పెట్టిన తర్వాత కూడా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని సుభాష్ అంటాడు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇందు వాళ్ళకి కూల్ గా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత ఇందుకి సపోర్ట్ గా ఎవరో ఒకరు రావాలని అపర్ణ అంటుంది. మరొకవైపు భ్రమరాంబ కోపంగా రేఖ దగ్గరికి వస్తుంది. నువ్వు నా తమ్ముడిని ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావ్.. ఆస్తులన్నీ నీ చేతుల్లోకి తెచ్చుకుంటానన్నావ్ కదా.. ఇప్పుడు ఆ ఇందుని మహారాణిలాగా చూస్తున్నావని భ్రమరాంబ అనగానే వదిన నా ప్లాన్ నాకుంది.. రెండు రోజుల్లో ఇందు బర్త్ డే ఉంది. దాంతో సంతకం పెట్టించాలని రేఖ అంటుంది. మరొకవైపు రాజు, లక్కీ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. పదివేలకి కక్కుర్తి పడితే పది లక్షలు బొక్క అయిందని లక్కీ అంటాడు. ప్రొద్దున ఎవరి మొహం చూసామో అని లక్కీ అనగానే ఇంకెవరు ఆ ఇందు.. ప్రొద్దున గొడవ పడింది కదా.. దాని సంగతి చెప్తానని ఇందుకి రాజు ఫోన్ చేస్తాడు. ఇద్దరు గొడవపడతారు. మరొకవైపు ఐశ్వర్య టెన్షన్ పడుతూ రేఖ దగ్గరికి వచ్చి పది లక్షలు అడుగుతుంది. సరే ఇస్తానని రేఖ అనగానే ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అవి ఎందుకో చెప్పమని రేఖ అనగానే ఐశ్వర్య సైలెంట్ అవుతుంది. మీ నాన్న కూడా అంతే.. మా అమ్మని చాలాసార్లు మోసం చేసి డబ్బు తీసుకునేవాడు.. నేను మా అమ్మలాగా మోసపోవాలని అనుకోవడం లేదని రేఖ అంటుంది. ఇప్పుడు చెప్తే నా తప్పులన్ని ఒప్పుకోవాల్సి వస్తుందని ఐశ్వర్య వెళ్ళిపోతుంది . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 03, 2026
Podharillu:మాధవ పెళ్లి కోసం మహా సాహసం.. తాయారు ఇంట్లో హైడ్రామా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -84 లో..... గాయత్రి, మాధవ రాత్రి మాట్లాడుకున్న మాటలన్నీ మహా వింటుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలని అనుకుటుంది. మాధవ ఇంటి నుండి పనికోసం వెళ్ళిపోయాక.. మిగతా ముగ్గురితో మాట్లాడుతుంది మహా. మీ అన్నయ్య మీ కోసం ఎంత హెల్ప్ చేసాడు.. మనం తన కోసం తన సంతోషం కోసం తనకి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యలేమా అని మహా అంటుంది. చక్రి ఒక సలహా, కన్నా ఒక సలహా ఇస్తారు. అవేవీ సెట్ అవ్వవు.. ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని కేశవ అడుగుతాడు. మనం మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి గాయత్రిని మీ అన్నయ్యకి ఇవ్వమని అడుగుదామని మహా అంటుంది. అది జరిగే పని కాదని ముగ్గురు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కేశవ మెకానిక్ షాప్ కి వెళ్లి మహా అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు. అప్పుడే శైలు వచ్చి గొడవపెట్టుకుంటుంది. మా నాన్నకి ఎందుకు ఫోన్ చేసావని గట్టిగా అరుస్తుంది నా డబ్బు నాకు ఇస్తే నీతో నాకెంటే అని కేశవ అంటాడు. ఆ డబ్బే ఉంటే నాకు ఇవ్వన్నీ కష్టాలు ఎందుకని శైలు అంటుంది. మరొకవైపు చక్రి, మహా మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. వాళ్ళని అలా చూసి ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ప్రొద్దున అన్నది నాకు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది.. వాళ్ళింటికి వెళ్లి మాట్లాడుదామని చక్రి అంటాడు. మరుసటి రోజు మాధవ వెళ్ళిపోయాక కేశవ, చక్రి, కన్నా, మహా కలిసి నారాయణ దగ్గరికి వెళ్లి మీ చెల్లి ఇంటికి వెళదామని మహా అంటుంది. మాధవకి గాయత్రి అంటే చాలా ఇష్టం కదా వాళ్ళని ఒక్కటీ చేద్దాం అని మహా అంటుంది. దానికి నారాయణ ఒప్పుకోడు. ఆ తర్వాత మహా, చక్రి, కేశవ, కన్నా నలుగురు కలిసి సంబంధం మాట్లాడడానికి తాయారు ఇంటికి వెళ్తారు. అక్కడ మొహం పైనే ఆ ఇంటికి నా కూతురిని పంపించానని చెప్తారు. ఇంకా మాధవని తిడుతుంటే చక్రి కోపంగా గాయత్రి వాళ్ళ నాన్న పీకపట్టుకుంటాడు. మహాపై తాయారు కోప్పడుతుంటే.. తనపైకి కేశవ కర్ర తీసుకొని వెళ్తాడు. తాయారు తాంబులాన్ని కిందపడేస్తుంది. మీలాంటి మూర్కులతో మాట్లాడడానికి వచ్చాము.. మాది తప్పు అని మహా అంటుంది. తరువాయి భాగంలో మహా వాళ్ళు వెళ్ళిన విషయం మాధవకి నారాయణ చెప్తాడు. అసలు మీరెవరు వెళ్ళడానికి అని మహా పైకి మాధవ గట్టిగా అరుస్తాడు. దాంతో మహా బాధగా లోపలకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 03, 2026
Jayam Serial:వీరు అసలు రంగు బయటపడుతుందా.. రుద్ర మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -233 లో..... పెద్దసారుపై వీరు ఎటాక్ తో రుద్ర షాక్ అవుతాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. వీరు హాస్పిటల్ కు వచ్చి ఇలా ఎలా జరిగిందని ఏం తెలియనట్లు యాక్టింగ్ చేస్తాడు. ఖచ్చితంగా ఇదంతా ఎవడో కావాలనే చేసాడు.. వాడి సంగతి చెప్పాలి అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సూర్య అంటాడు. ఎందుకు తొందరపాటు.. ముందు మావయ్యని కోలుకొనివ్వండి అని ఇషిక అంటుంటే అంటే ఏంటి ఇషిక.. వదిలేయ్ మంటావా మావయ్యని ఆ పరిస్థితిలో చూడలేక పోతున్నానని ప్రమీల అంటుంది. నువ్వు కూడా మాట్లాడుతున్నావా.. అసలు నువ్వు బయటకు వెళ్లి బిజినెస్ చూసుకోవడం వల్లనే కదా.. ఈ ఇంటికి అరిష్టం వచ్చిందని శకుంతల అనగానే ప్రమీల ఏడుస్తుంది. డాక్టర్ వచ్చి ప్రమాదం ఏం లేదని చెప్తాడు. మీరు అందరు వెళ్ళండి. నేను పెద్దనాన్న దగ్గర ఉంటానని రుద్ర అంటాడు. అవసరం లేదు నేను వీరు ఉంటామని శకుంతల అనగానే సరే వీరు ఉండు అని రుద్ర అంటాడు. లేదు అత్తయ్య ప్రీతీకి బీపీ డౌన్ అయింది. నేను వెళ్ళాలని వీరు అంటాడు. మీరు కూడ రండి అత్తయ్య.. రుద్ర బావ చూసుకుంటాడని వీరు అంటాడు. అందరు వెళ్ళిపోతారు.. బావ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ చెయ్ బుల్లెట్ స్పీడ్ లో వస్తానని రుద్రతో వీరు చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత వీరు, ఇషిక ఒక కార్ లో వెళ్తారు. ఎదురుగా రుద్ర హెల్మెట్ పెట్టుకొని ఉంటాడు. ఎవరు అతను అని ఇషిక అడుగుతుంది. రుద్ర అని వీరు చెప్తాడు. ఇప్పుడు వెళ్లి ఆ మొహానికి ఉన్న మాస్క్ పోయేలా చేస్తాను.. నువ్వు వీడియో తియ్.. రుద్ర నాపై ఎటాక్ చేసాడని ఇంట్లో అందరికి చూపిస్తానని ఇషికకి వీరు చెప్పి వీరు కార్ దిగుతాడు. వీరుని రుద్ర కొడుతాడు. దెబ్బ బయటకు కన్పించకుండా రుద్ర కొడతాడు. వెంటనే రుద్ర వెళ్ళిపోతాడు. అదేంటీ బ్రో అలా కొట్టి వెళ్ళిపోయాడని ఇషిక అంటుంది. ఇంట్లో ఈ విషయం చెప్దామని ఇషిక అనగానే అవసరం లేదు దీన్ని ఇంతటితో వదిలేయ్.. అవసరం వచ్చినప్పుడు నేను చూసుకుంటానని వీరు అంటాడు. ఆ తర్వాత పెద్దసారు డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరు తనతో పాటు ఉంటే ఎవరి పనులకి వారు వెళ్ళండి అని పంపిస్తారు. రుద్రతో మాట్లాడుతాడు పెద్దసారు. నీకు ముందే డౌట్ వచ్చింది కదా నీలో టెన్షన్ చూసాను.. నువ్వు ఈ కుటుంబానికి ఏం కాకుండా కాపాడుతావు.. ఎవరో ఈ కుటుంబాన్ని పగ పట్టారని పెద్దసారు అంటాడు. లేదు పెద్దనాన్న బిజినెస్ పరంగా కుట్రలు అంతేనని రుద్ర చెప్తాడు. అదంతా వీరు వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 03, 2026
Karthika Deepam2:డీఎన్ఏ రిపోర్ట్స్ చూసి షాక్ లో కార్తీక్.. జ్యోత్స్న పగ తీరుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 (Karthika Deepam2 )'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-634 లో.. జ్యోత్స్నకి తగిలి శౌర్య పడిపోవడంతో జ్యోత్స్న మీద పారిజాతం సీరియస్ అవుతుంది. శౌర్యకి సారీ చెప్పాలని పారిజాతం డిమాండ్ చేస్తుంది. దానికి జ్యోత్స్న నిరాకరిస్తుంది. ఇక పారిజాతం పట్టుబట్టి శౌర్యకి జ్యోత్స్న సారీ చెప్పేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత జ్యూస్ తీసుకొస్తుంది పారిజాతం. ఇక ఇదే మంచి సమయం అనుకొని కార్తీక్ పారిజాతాన్ని ఇరికించాలని చూస్తాడు. జ్యూస్ నీ మనవరాలికే ఇస్తావ్ కదా పారిజాతం అనగానే హా అవును అని దీపకి ఇస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. నీ మనవరాలు జ్యోత్స్న కదా.. దీపకి ఎందుకు ఇచ్చావని శ్రీధర్, కార్తీక్ లతో పాటు అందరు అడుగుతారు. నా మనవడు కార్తీక్ ని చేసుకుంది కాబట్టి తను కూడా నా మనవరాలే.. పైగా తను కడుపుతో ఉందని పారిజాతం కవర్ చేస్తుంది. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. గ్రానీకీ మా అమ్మ మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందని శౌర్య అనగానే అదే నేను తెలుసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీప పైన జ్యూస్ తాగుతుంటే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. మా అమ్మనాన్మలని మీ అమ్మనాన్నలని అనుకోని ఉండు అని జ్యోత్స్న అనగానే అనుకోనా అని దీప అంటుంది. ఇప్పటికీ అనుకోమని అనగానే సరే అని దీప వెళ్ళిపోతుంది. నీ చావుకి ముహూర్తం పెట్టే ఈ పార్టీ పెట్టాను.. నీ ఫోటోకి దండేసే కార్యక్రమం సిద్దంగా ఉంది. నువ్వు చావడానికి రెడీగా ఉండు దీప అని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు శౌర్యకి చాక్లెట్స్ ఇస్తుంది పారిజాతం. ఆ తర్వాత తనని జ్యోత్స్న గదిలోకి తీసుకెళ్ళి తన బెడ్ పై ఆడిస్తుంది. అక్కడే కొన్ని పేపర్లు కనిపిస్తాయి . తనకి చదువు రాదు కాబట్టి శౌర్యని చదవమని అంటుంది. కానీ తను చదవలేదు. ఇక జ్యోత్స్నని అడిగితే చెప్పదు అని అనుకొని అప్పుడే అటుగా కార్తీక్ వస్తుంటే అతడిని అడుగుతుంది. కార్తీక్ ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అవుతాడు. అందులో జ్యోత్స్న, సుమిత్ర, దీప డీఎన్ఏ సాంపిల్స్ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే జ్యోత్స్న నిజం తెలుసుకుంది. ఏదో ప్లాన్ తో ఉందని కార్తీక్ అనుకుంటాడు. అదే సమయంలో జ్యోత్స్న వస్తుంటుంది. దాంతో పారిజాతం లోపలికి వెళ్ళి ఎక్కడి రిపోర్ట్స్ అక్కడే పెట్టి వస్తుంది. మా గ్రీనీకి ఏం చెప్పావ్ బావ తను అలా చేస్తుందని కార్తీక్ ని జ్యోత్స్న అడుగగా.. ఏం చెప్పలేదని కార్తీక్ అంటాడు. నీతో తర్వాత మాట్లాడుతాను బావ అని చెప్పేసి జ్యోత్స్న తన గదిలోకి వెళ్తుంది. అక్కడ రిపోర్ట్స్ చూసి.. గ్రానీ ఎందుకు వచ్చింది.. చూసిందా.. నాకు అవమానం వచ్చిందంటే నేను అనుకున్నది చేయాల్సిన టైమ్ వచ్చిందన్నమాట.. దీప ఎక్కడున్నావమ్మా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 03, 2026
Illu illalu pillalu: శ్రీవల్లి మోసాన్ని తెలుసుకున్న చందు..పుట్టింటికి గెంటేసాడుగా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-435 లో.. శ్రీవల్లి గురించి భాగ్యం టెన్షన్ పడుతుంది. ఆనందరావు వచ్చి సరసాలు ఆడుతుంటే భాగ్యం చీవాట్లు పెడుతుంది. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. ప్రేమ ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ డిలీట్ చేశానని శ్రీవల్లి చెప్పగానే భాగ్యం , ఆనందరావు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రీరామనవమి రోజు వాళ్ళకి చుక్కలు చూపించాలి మీరు తొందరగా వచ్చేయండి అని భాగ్యం, ఆనందరావులతో శ్రీవల్లి చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి చందు ఉంటాడు. మరోవైపు అమూల్యని ప్రేమ పిలుస్తుంది. మీ చందు అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు గార్డెన్ లో ఉన్నాడని చెప్పగానే తను గార్డెన్ వైపు వస్తుంది. అలాగే నర్మదని తీసుకొని ప్రేమ గార్డెన్ కి వస్తుంది. ఇక చందు, శ్రీవల్లి గార్డెన్ లో మాట్లాడుతుంటారు. విశ్వని అమూల్య ప్రేమించమని చెప్పిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు..ఎవరని శ్రీవల్లిని చందు అడుగగా.. ప్రేమ అని చెప్తుంది. తన అన్నయ్య కోసం ఇలా చేసిందని లేనిపోనివి అన్నీ చెప్తుంది శ్రీవల్లి. అదంతా అమూల్య వింటుంది. వదిన అంటూ కోపంగా శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. అసలు నువ్వు మనిషివేనా నీ కాపురం బాగుండటం కోసం ప్రేమ వదిన కాపురం నాశనం చేయాలని చూస్తావా అని తిడుతుంది. నీ కాపురం నాశనం అవుద్దని నర్మద, ప్రేమ వదినల దగ్గర మాట తీసుకొని నువ్వు చేసిన మోసాన్ని ఎవరికి చెప్పకుంటే ఇలా చేస్తావా అని శ్రీవల్లిని అమూల్య తిడతుంది. ఏమైందని చందు అడుగగా.. శ్రీవల్లి చేసిన మోసం మొత్తం చెప్తుంది. విశ్వని ప్రేమించడానికి కారణం వల్లి వదిన, పెళ్లి ముందురోజు రాత్రి కూడా నేను బయటకు వెళ్ళడానికి వల్లి వదినే కారణం అనగానే చందు తన చెంప చెల్లుమనిపిస్తాడు. అమూల్యకి ఇచ్చిన మాట కోసం నిజం చెప్పకుండా ఉంటే తను మాత్రం నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసిందని ప్రేమ అంటుంది. మీ భార్యలు ఎలాంటివారో తెలుసుకోకుండా వాళ్ళతో ఎలా ఉంటున్నార్రా అని సాగర్, ధీరజ్ లని అడిగారు కదా బావ.. మీ భార్య గురించి మీకు తెలియాలనే ఇలా చేశాం బావ.. ఇక నిర్ణయం మీదే అని నర్మద అంటుంది. మరోవైపు ఇంట్లో శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం వేదవతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాసేపటికి పూజారి వస్తాడు. వేదవతి అందరిని పిలుస్తుంది. ఇక మరోవైపు చందు తన గదిలోకి వెళ్ళి శ్రీవల్లి బట్టలు అన్నీ సర్దుతుంటాడు. ఆ నర్మద, ప్రేమ కావాలనే ఇలా చేశారు బావ.. నా తప్పేం లేదు బావ అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది శ్రీవల్లి . నీ దొంగ ఏడుపు చాలు.. పదా అని చెప్పి ఇంటి వెనుక నుండి బ్యాగ్ తో పుట్టింటికి తీసుకెళ్తాడు. నీ జీవితమే అబద్ధం.. ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించకు.. అబద్దాలతో మోసాలతో పెళ్ళి చేస్తే ఇలాగే ఉంటుందని మీ వాళ్ళతో చెప్పు అని శ్రీవల్లిని భాగ్యం వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్తాడు చందు. మరోవైపు భాగ్యం, ఆనందరావు రెడీ అయి వస్తుంటారు. అప్పుడే శ్రీవల్లి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటి అమ్మడు వస్తున్నాం కదా.. ఎందుకు వచ్చావ్ అని భాగ్యం అడుగుతుంది. సంపేత్తాను అని కోపంగా వాళ్ళ మీద అరుస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత బాధగా ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 03, 2026
మూడు నెలలు భార్యకు కాపలా కాసిన నటరాజ్ మాస్టర్!
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో చాలామంది కపుల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్య లవ్, కంపాటిబిలిటీ ఎంత రేంజ్ లో ఉందో తెలుసుకోవడానికి లవ్ గురు వాళ్లకు టెస్టులు పెడుతూ ఉంటారు. ఈ రోజు అలాంటి ఒక పేమ, నమ్మకం, ట్రస్ట్ గురించి అడగడంతో నటరాజ్ మాస్టర్ ఓపెన్ అయ్యాడు. "పెళ్ళికి ముందు ఎన్ని చేసినా పెళ్లయ్యాక ఎన్నో విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఆడవాళ్ళకు కంట్రోలింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది కానీ మగవాళ్లకు అది ఉండదు. అది కొంతమందికి అందరినీ అనట్లేదు. అప్పుడు ఆ విషయాలకు అట్ట్రాక్ట్ ఐపొతూ ఉంటాం మనం. నేను కూడా అలానే ఆ మిస్టేక్ చేసాను. నేను అప్పట్లో చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడిని చాలా ఆటిట్యూడ్ తో ఉండేవాడిని. ఏమన్నా కొంచెం గట్టిగా మాట్లాడినా నీతూ భయపడిపోయేది. నేను చేసిన ఒక తప్పు వల్ల ఆమె ఒక భద్రకాళిలా మారింది. దాంతో నేను ఒక్కసారి సైలెంట్ ఐపోయాను. ట్రస్ట్ ఉండే చోటే ప్రేమ ఉంటుంది అంటారు కానీ ప్రేమ ఉన్న చోటే ట్రస్ట్ ఉండాలి, ఉంచుకోవాలి. నీతూ ఒక్క క్షణం ఆవేశంగా ఆలోచించి ఉంటే నాకు మీడియాలో ఒక బాడ్ నేమ్ వచ్చేది. అలా కోపంలో ఆవేశంలో తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని నాశనం చేసేసేది. అప్పుడు నీతూ నా వెనక నిలబడి నన్ను సరిదిద్దుకుంది. ఐతే ఆ సమయంలో నీతూ చాలా ఇబ్బందిపడింది. మేము ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం. అర్ధరాత్రి ఒంటి గంటకు కత్తి పట్టుకుని పైకి వెళ్లిపోయేది. నేను కూడా ఆమె వెనకాలే వెళ్ళేవాడిని. అలా మూడు నెలలు ఎం పని చేయకుండా ఆమె వెనకాలే ఉన్నా. ఆ టైములో నేను అవును మగాడిని ఎంత తప్పయినా చేస్తాను అని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటే ప్రేమను పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే నన్ను నమ్మి వచ్చిన ఆమెకు ఏమయ్యేది. నేను బాత్ రూమ్ కి వెళ్లినా సరే డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళేవాడిని. మూడు నెలలు ఎవరికీ తెలీదు ఈ విషయం. ఆమెకు, నాకు నిద్రలే లేవు. నమ్ముతారో లేదో బయట నుంచి ఫుడ్ తెప్పించుకుని తిన్నాం. ఆ నమ్మకాన్ని తెచ్చుకోవడానికి మూడు నెలలు పట్టింది. నా మొబైల్ ఎప్పుడూ లాక్ లో ఉండేది. అప్పుడు ఆమె నమ్మకాన్ని పోగొట్టుకున్నా కాబట్టి ఆ తరువాత నా మొబైల్ కి ఏ లాక్ లేకుండా అలా పడేసా. ఈ మూడు నెలలు ఆమెతోనే ఉన్నా. గుమ్మం దాటి కాలు బయట కూడా పెట్టలేదు. ఆమె దగ్గర నమ్మకాన్ని సంపాదించడానికి ఏడాది పట్టింది. ఇప్పటికి 15 ఏళ్ళు అయ్యింది. ఒక పాప. హ్యాపీ లైఫ్ ఇప్పుడు మాది. "అని చెప్పాడు నటరాజ్.
Apr 02, 2026
ఆస్కార్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్
కుక్కలకు మనుషుల పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో అంతే అనుబంధం ఉంటుందన్నది కాదనలేని నిజం. ఇప్పుడు అలాంటి ఒక అనుబంధం ఆటా షోలో కనిపించింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో తనుశ్రీ - ప్రాచి కలిసి పెర్ఫార్మ్ చేశారు. ప్రాచి చిన్న కుక్కపిల్ల గెటప్ వేసి తనుశ్రీతో కలిసి గురు మూవీలోని "ఓ సక్కనోడా పట్టుపిడికిలై" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. ఐతే ప్రాచి గెటప్ కి ఆ డాన్స్ కి జడ్జ్ నిహారిక స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. "ఎమోషన్ కూడా ఒక డాన్స్ " అంటూ రఘు మాష్టర్ చెప్పారు. ఇదంతా పక్కనపెడితే అందరూ పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే సుధీర్ మాత్రం ఏడుస్తూ కనిపించాడు. అప్పుడు అందరూ అడిగేసరికి "నాకు మా ఆస్కార్ గుర్తొచ్చింది." అని చెప్పాడు. "ఇప్పుడు లేదా ఆస్కార్ " అంటూ కావ్య క్యూట్ గా అడిగింది. "వాడిని మేము చాలా మిస్ అవుతున్నాం... ఇప్పుడు లేడు" అని చెప్పాడు " టిక్ ఫీవర్ లో చాల వెరైటీస్ ఉంటాయంట.. అందులో ఒక రేరెస్ట్ ఫీవర్ వచ్చింది. డాక్టర్స్ రెండు రోజుల తర్వాత చనిపోయింది అని డిక్లేర్ చేసేసారు. ఇప్పటికీ హార్ట్ లో తెలీని పెయిన్" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సమీరా భరద్వాజ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
Apr 02, 2026.webp)
భర్త ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తమన్నా
ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పేరు బుల్లితెర మీద సోషల్ మీడియాలో తెలియని వారు ఎవరూ లేరు. బిగ్‌బాస్-3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళింది. అలాంటి తమన్నా సింహాద్రి ఇన్స్టాగ్రామ్ పేజీలో రీసెంట్ గా ఒక పిక్ ని పోస్ట్ చేసింది. అది వైరల్ గా మారింది. తమన్నా తన భర్తతో దిగిన ఫోటో అది. దానికి నెటిజన్స్ ఐతే చాలా కామెంట్స్ చేస్తున్నారు. "ఫైనల్లీ నా హజ్బెండ్ ఫోటోని రివీల్ చేసేసాను. నన్ను దీవించండి" అని పెట్టిన పోస్ట్ కి ఇనాయ సుల్తానా రెస్పాండ్ అయ్యింది. "కంగ్రాట్యులేషన్స్ ఆనందంగా ఉండు. నైస్ కపుల్, నైస్, సూపర్ జోడి, అక్కడ బావ సినిమా హీరోలా ఉన్నాడు. అందుకే ఇప్పటివరకు ఎవరికీ చూపించకుండా దాచేసారు కదా. గాడ్ బ్లేస్ యు అక్కా.. మా జంట దిష్టి తీయించుకోండి. సూపర్ అక్క" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఉన్న టైములో రవి కృష్ణ గురించి బూతులు బాగా మాట్లాడిన తమన్నా సింహాద్రిని తరువాత హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇక శ్రీముఖి తనను దత్తత తీసుకుంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే ఎక్కువగా శ్రీముఖి ఇంట్లో కనిపిస్తూ వీడియోస్ చేస్తూ ఉంటుంది తమన్నా సింహాద్రి. https://www.instagram.com/p/DWjhL58CNFR/p>
Apr 02, 2026
నేహా చౌదరి మరుపురాని సంఘటనలు..శేఖర్ మాస్టర్ కొన్నారోచ్
నేహా చౌదరి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ పర్సన్. రీసెంట్ గా బిబి జోడిలో విశ్వతో కలిసి పెర్ఫార్మ్ చేసింది. ఫినాలేలో సెకండ్ పొజిషన్ లో నిలిచింది ఈ జోడి. అలాంటి నేహా ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉంది. డాన్స్ చేసి చేసి అలసిపోయింది. రీసెంట్ గా ఆమె రెండు ఇంటరెస్టింగ్ పోస్టులను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది. "ప్రతీ నిద్ర లేని రాత్రి అంటే కేవలం జీవితంలో ఎదురైన మర్చిపోలేని, తట్టుకోలేని బాధలు మాత్రమే కాదు అప్పుడప్పుడు అర్ధరాత్రి సమయంలో నేను అడక్కుండానే మోకాలు నాకు నొప్పిని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఐనా కానీ నేను మనస్ఫూర్తిగా ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాను" అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని తన స్టేటస్ లో పెట్టింది నేహా చౌదరి. అలాగే ఇంకో పోస్ట్ ని చూస్తే "కొన్ని మరుపురాని సంఘటనలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. ఇది కూడా అలాంటి ఫీలింగే. శేఖర్ మాష్టర్ నా బుక్ ఫస్ట్ కాపీ కొన్నారు. ఆ ఫీలింగ్ మర్చిపోలేనిది. మంచి మాటలకు చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఆ పుస్తకాన్ని రాయడాన్ని ఎంత ప్రేమించానో మీరు కూడా ఆ బుక్ ని చదవడంలో అంతే ప్రేమ చూపిస్తారని " అంటూ నేహా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.
Apr 02, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



