![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గ ఉంది. ఈ ఎపిసోడ్ కి గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్స్ వసు - రిషి సర్ వచ్చారు. ఇందులో కొన్ని లేఖల చదివే కాన్సెప్ట్ పెట్టారు. విజయవాడ నుంచి విరాజిత గారు రాస్తున్నారు అని హరి చాడివాడు. "విరాజిత ఇక్కడే ఉంది కదా రా " అంది శ్రీముఖి. "ఆవిడ వేరు విజయవాడలో" అన్నాడు. ఇక అక్కడే ఉన్న విరాజిత పగలబడి నవ్వింది.
"ముఖేష్ రక్షా కెమిస్ట్రీకి నేను పెద్ద ఫ్యాన్. వాళ్ళు ఎప్పుడు కలిసి చేతులు పట్టుకున్నా నాలో ఏదో తెలీని ఫీలింగ్. రిషి - వసుధారా క్యూట్ గా లవ్ ప్రొపోజల్ చేసుకుంటే చూడాలని ఉంది " అని చదివాడు. తర్వాత వసు గులాబీ ఇస్తూ "రిషి నువ్వు నా లైఫ్ లోకి వస్తే ఫుల్ ఖుషి . ఐ లవ్ యు రిషి సర్ " అంది.
తర్వాత ఇంకో లెటర్ ని చదివాడు. "సామర్లకోట నుంచి సమీరా " అనేసరికి అక్కడే షోలో ఉన్న సమీరా తెగ నవ్వేసింది.
"ప్లీజ్ దయచేసి సమీరా గారి సెకండ్ ఫోటో వేయండి " అంటూ అవినాష్ చదివాడు. దానికి అందరూ నవ్వేశారు. "ముఖేష్ రక్షా కెమిస్ట్రీకి నేను పెద్ద ఫ్యాన్. సీరియల్ లో అప్పుడు వాళ్ళు హగ్ చేసుకున్నప్పుడు మా ఆయన్ని హగ్ చేసుకున్నట్టు ఫీలయ్యేదాన్ని. ఇప్పుడు వాళ్ళ హగ్ చూడగానే నా కడుపు నిండిపోయింది. " అంటూ లైవ్ లో ఉన్నట్టుగా చదివేసరికి శ్రీముఖి కౌంటర్ వేసింది. "ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారా ఆవిడా " అనేసరికి నాలిక్కరుచుకున్నాడు హరి.
![]() |
![]() |