![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2'). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -737 లో.....జ్యోత్స్న నిద్రపోతుంది ఎదురుగా సూరజ్ ఉంటాడు. ఒక్కసారిగా లేచి నువ్వు ఏంట్రా ఇక్కడ అని కోప్పడుతుంది. నేను నీకు సెక్యూరిటీ అని సూరజ్ చెప్తాడు. ముందు ఇక్కడ నుంచి వెళ్లరా అని అక్కడున్న వస్తువులన్నీ విసిరేస్తుంది జ్యోత్స్న. తీరా చూస్తే అక్కడ పారిజాతం ఉంటుంది. ఏంటే అలా విసిరేస్తున్నావని పారిజాతం అంటుంది.
గ్రానీ అక్కడ సూరజ్ ఉండాలని జ్యోత్స్న అనగానే అంటే వాడు నిన్ను నిద్ర కూడా ప్రశాంతంగా పోనివ్వడం లేదా అని పారిజాతం అంటుంది. వాడు నిజంగానే వచ్చాడని జ్యోత్స్న అనగానే మరి నాకు కన్పించలేదని పారిజాతం అంటుంది. వాడి సంగతి చెప్తానని జ్యోత్స్న కోపంగా సూరజ్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఎందుకురా నా రూమ్ కి వచ్చావని సూరజ్ ని జ్యోత్స్న అడుగుతుంది. నేనెప్పుడూ వచ్చానని సూరజ్ అంటాడు అప్పుడే పారిజాతం వచ్చి మీ తాత లేస్తాడు.. వెళదాం రావే అని లాక్కొని వెళ్తుంది.రేపు ప్రొద్దున నీ సంగతి చెప్తానని జ్యోత్స్న అంటుంది. ఉదయం సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది. తన వెనకాల అందరు ఉంటారు.నా కూతురు నీ మీద కంప్లైంట్ ఇచ్చిందని దశరథ్ అంటాడు. నా కూతురు ఫొటోస్ తీసావంట తనని ఏడిపిస్తున్నావ్ అంట అని సూరజ్ ని దశరథ్ అడుగుతాడు. అడగడం కాదు బావ నువ్వు లోపలికి రా అంటూ సూరజ్ గదిలోకి కార్తీక్ ని తీసుకొని జ్యోత్స్న వెళ్తుంది. అక్కడున్న ఫోటో అల్బమ్ ని చూపిస్తుంది. ఆ ఫొటోస్ చూసి కార్తీక్ షాక్ అవుతాడు. బయటకు వచ్చి నిజంగానే సూరజ్ ఫొటోస్ తీసాడని కార్తీక్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఇదే కాదు మొన్న షర్ట్ పై పప్పు పోసినందుకు తన షర్ట్ ఉతకమని వీడియో కాల్ చేసి బ్లాక్మెయిల్ చేసాడని ఇలా అన్నీ చెప్తుంది.
ఆ తర్వాత జ్యోత్స్న గారికి నేనంటే కోపం అందుకే ఇవన్ని చెప్తుంది. ఫోటోలు తియ్యడం నాకు అలవాటు అందుకే తీసాను. అలా అని అందరి ఫొటోస్ చూపిస్తాడు. జ్యోత్స్న చేసిన పనులన్నీ సూరజ్ చెప్తాడు. రోజు నా దగ్గరికి వస్తుంది కావాలంటే పారిజాతం గారిని అడగండి అని సూరజ్ అనగానే అవునని పారిజాతం అంటుంది. వాడు అన్ని అబద్దాలు చెప్తున్నాడు.. వాడు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేద్దని జ్యోత్స్న అనగానే సరే నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని శివన్నారాయణ అందరిని అడుగుతాడు. జ్యోత్స్నకి సూరజ్ కరెక్ట్ అని దీప అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |