![]() |
![]() |

గురు పూర్ణిమ అంటే చాలా మంది సాయి బాబాను , కొందరు గణేషుడిని ఇలా రకరకాలుగా వాళ్ళు కొలిచే దైవాన్ని పిక్స్ గా స్టేటస్ లో పెట్టుకుంటారు అలాగే వాళ్లకు పూజలు చేసుకుంటారు. ఇదంతా డివోషనల్ కానీ రేయాలిటీలోకి వచ్చేసరికి ఎవరికైతే ఏమీ లేని సమయంలో ఒక అవకాశం ఇచ్చి చెయ్యి అందిస్తారో వాళ్లనే గురువుగా భావిస్తారు. ఇక అలాంటి వాళ్ళు హెల్ప్ చేసి చెయ్యి అందించేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు.
ఐతే బుల్లితెర విషయానికి వస్తే ఢీ డాన్స్ షో అందరికీ తెలుసు. అందులో చిట్టి మాష్టర్ అంటే ఫుల్ ఫేమస్. చాలామందిని పైకి తెచ్చాడు కూడా మిగతా డాన్సర్స్ కూడా స్టేజి మీద చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి చిట్టి మాష్టర్ ని తమ గురువుగా భావిస్తూ చాలామంది డాన్సర్స్ ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఆయన పిక్ ని తమ స్టేటస్ లో పెట్టుకున్నారు. అలా తన పిక్ ని పెట్టుకున్న వాళ్ళందరి స్టేటస్ లను స్క్రీన్ షాట్స్ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు చిట్టి మాష్టర్.
డాన్సర్ అనిల్ ఐతే హ్యాపీ గురు పూర్ణిమ మాష్టర్ అని చెప్పాడు. ఢీ చందు ఐతే గాడ్ ఫాదర్ అని పెట్టుకున్నాడు. డాన్సర్ కమలాకర్ ఐతే హ్యాపీ గురు పూర్ణిమ మాష్టర్ అని , ఢీ శివ కూడా హ్యాపీ గురు పూర్ణిమ మాష్టర్ ఐ లవ్ యు అంటూ పోస్ట్ చేసుకున్నాడు. అలాగే ఢీ లోని బాబీ మాష్టర్ కొరియోగ్రాఫర్ జిత్తు మాష్టర్ కి గురు పూర్ణిమ విషెస్ చెప్పాడు. ఏదేమైనా అజ్ఞానమనే చీకటికి పారదోలి వెలుగును ప్రసాదించడమే గురువు యొక్క లక్షణం అలాంటి గురువులందరికీ వందనం.
![]() |
![]() |