![]() |
![]() |

శ్రీసత్య బుల్లితెర మీద బాగా ఫేమస్ ఐన అమ్మాయి. హీరో పోతినేని రామ్ అంటే పిచ్చి ఆమెకు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్లిన అమ్మాయి. అలాంటి శ్రీ సత్య రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో బోర్ కొడుతోంది రండి మాట్లాడుకుందాం అంది. దాంతో వెంటనే అమరదీప్ చౌదరి లైన్ లోకి వచ్చేసాడు. "పద జపాన్ వెళదాం... తుఫాన్ రేపుదాం" . "విజయవాడలో మీ ఇల్లు ఎక్కడ " "హారిక వాళ్ళ ఇంట్లో". "ఎలాంటి బిల్ లేకుండా నా దిల్లు తీసుకో" అన్నారు. వెంటనే హార్ట్ సింబల్ చూపించింది. "బీచెస్ ఆర్ మౌంటైన్స్ " అని అదియేసరికి "ఎప్పటికీ బీచ్ పర్సన్ " అని చెప్పింది. " ఎవరూ ఊహించని విధంగా, మీలో రహస్యంగా ఉన్న నైపుణ్యం కానీ ఏదైనా విషయం కానీ ఉందా " అని అడిగారు" . ఎవరూ ఊహించనిది చెప్పడం అంటే ఎలా సీక్రెట్ ని ఎలా రివీల్ చేయాలి అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చింది.
"ఒక కోలాబ్ షూట్ ఎప్పుడు చేద్దాం " అని ఒక నెటిజన్ అడిగేసరికి "త్వరలో ఒక టెంపుల్ రీల్ కలిసి చేద్దాం " అని చెప్పింది. ఇలా శ్రీ సత్య తనను ప్రశ్నలు అడిగిన వాళ్లకు ఆన్సర్స్ ఇచ్చింది. ఇక ఒక వియర్డ్ ఫోటో ఒకటి చూపించమని అడిగారు. నాలుక బయటపెట్టి సరదాగా ఒక పిక్ పెట్టింది అలాగే చందమామతో కలిసిన పిక్ , తన ఫామిలీ మెంబర్స్ తో దిగిన పిక్ ని కూడా ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది. శ్రీ సత్య మిస్ విజయవాడ టైటిల్ ని గెలుచుకుని మిస్ ఆంధ్ర పోటీల్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరో రామ్ చాల యంగ్ ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు కాబట్టి తానూ అలాగే ఇండస్ట్రీలోకి వెళ్లాలని కంకణం కట్టుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక శ్రీసత్య బీబీ జోడి 2లో కంటెస్టెంట్ గా చేసింది.
![]() |
![]() |