![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ ఇప్పటికే 165 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ లలో అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.. ఈ సీరియల్ లో ప్రధానంగా రెండు కుటుంబాలు ఉంటాయి. నారాయణ ఫ్యామిలీ ప్రతాప్ ఫ్యామిలీ ఉంటాయి. నారాయణ కుటుంబంలో కేశవ, మాధవ, కన్నా, చక్రి ఉంటారు. ఇక ప్రతాప్ ఫ్యామిలీలో ఆది, మహా ఉంటారు. ఇక మహా అల్లారుముద్దుగా పెరుగుతుంది. అయితే తను బాగా చదువుకుంటుంది. సరిగ్గా జాబ్ వచ్చే టైమ్ కి వాళ్ళ నాన్న ప్రతాప్ తనని అపార్థం చేసుకుంటాడు. ఒక రాపిడో డ్రైవర్ తో మహా బండి మీద ఒక ఇంటర్వూ కి వెళ్ళడం మహా వాళ్ళ నాన్న ప్రతాప్ చూస్తాడు. అయితే తను జాబ్ చేయడం ప్రతాప్ కి ఇష్టం ఉండదు.. దాంతో ఇంటికి వచ్చిన మహాని ఎక్కడికి వెళ్ళావ్ అని ప్రతాప్ అడిగినప్పుడు ఇంటర్వ్యూ అని చెప్పకుండా ఫ్రెండ్ దగ్గరికి అని మహా అబద్ధం చెప్తుంది. దాంతో మహా ఎవరినో ప్రేమిస్తుందని ప్రతాప్ అనుకుంటాడు.
ఇక మరుసటి రోజు మహాకి పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తాడు ప్రతాప్. మహాకి జాబ్ చేయడం డ్రీమ్ కాబట్టి పెళ్ళికి నిరాకరిస్తుంది మహా. అయితే అప్పటికే నారాయణ కొడుకు చక్రి మహాని చూసి ఇష్టపడుతాడు. ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పడం కోసం ప్రతాప్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. ఇక మహాకి ఇష్టం లేని పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారని వాటిని క్యాన్సిల్ చేయడానికి మహాకి చక్రి సహాయం చేస్తాడు. దాంతో చక్రి మీద పాజిటివ్ హోప్ పెట్టుకుంటుంది మహా. ఇక అక్కడి నుండి మహాకి చక్రి ప్రతీ విషయంలో సహాయం చేస్తుంటాడు. దాంతో ఇష్టంలేని పెళ్ళి చేసుకోనని ఇంట్లో నుండి డ్రైవర్ చక్రితో పాటు బయటకు వస్తుంది మహా. అయితే మహా వాళ్ళ నాన్న ప్రతాప్, ఆది తప్పుగా అర్థం చేసుకుంటారు. మహా, చక్రి ప్రేమించుకొని లేచిపోయారని అపార్థం చేసుకొని ఎలాగైనా వాళ్లని పట్టుకొని చక్రిని చంపెయ్యాలని మహా వాళ్ళ నాన్న ప్రతాప్, ఆది అనుకుంటారు. ఇక రౌడీలని పంపి చక్రిని చంపాలని చూస్తారు. కానీ మాధవ, కేశవ, కన్నా వచ్చి వారిని కాపడతారు.
ఇక ప్రతాప్, ఆదిల నుండి తప్పించుకోవడానికి మహా,చక్రి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఇక అక్కడ ఎస్సై ఇంకా కానిస్టేబుల్ కలిసి చక్రి, మహాల పెళ్ళి చేస్తారు. దాంతో మహా చనిపోయిందని , ఇక మనకు లేదని ప్రతాప్ ఫిక్స్ అవుతాడు. దాంతో మహా బాధపడుతుంది. ఇక మహాని తీసుకొని చక్రి తమ ఇంటికి బయల్దేరి వెళ్తాడు. అక్కడ మహా, చక్రి నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్లడంతో ఇంటికి పక్కన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే నారాయణ వాళ్ళు అంతా మగవాళ్ళే ఉంటారు. మహా ఒక్కతే ఆడది. ఇక కొన్నిరోజుల్లోనే మహా ఇంట్లో వాళ్ళతో కలిసిపోతుంది. మరోవైపు మాధవ తమ్ముడు కేశవ, శైలుతో లవ్ లో ఉంటాడు. కన్నా కాలేజీకి వెళ్తుంటాడు. మాధవ ఒక హిందీ అమ్మాయితో ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. మరోవైపు చక్రి, మహాల వివాహం క్యాన్సిల్ చేపించడం కోసం లాయర్ ని కాంటాక్ట్ అవుతుంది మహా. కానీ చక్రి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పడంతో అతను లాయర్ దగ్గరికి వచ్చి బెదిరిస్తాడు. దాంతో అతను కేసు వాదించనని చెప్తాడు. ఇక ప్రస్తుతం మహా, చక్రి మధ్య గొడవలు సాగుతున్నాయి. కేశవ-శైలు ల లవ్ ట్రాక్ లో కొన్ని గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |